రైతు నర్సింహులుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: ఎల్‌ రమణ

హైదరాబాద్‌: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని వర్గాల మండలం వేలూరు గ్రామంలో దళిత రైతు నర్సింహులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని టీడీపీ తెలంగాణ అధ్యక్షులు ఎల్. రమణ అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. దళితుల భూములు అన్యాక్రాంతం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం పరామర్శించాలని, ప్రతిపక్ష నేతలు వెళ్లేందుకు కూడా పర్మిషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కోటి రూపాయలు పరిహారం అందించాలని అన్నారు. రైతు కూతురికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Latest Updates