తన్నుకున్న టీడీపీ – వైసీపీ అభిమానులు

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనివాసపురం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ, టీడీపీ అభిమానులైన కొందరి మధ్య ఘర్షణ జరిగింది. దుడ్డు కర్రలు, గొడ్డళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

మాటామాటా పెరిగి… నెట్టుకోవడం.. కొట్టుకోవడం వరకు వెళ్లింది. ఒకరినొకరు తోసుకున్న రెండు పక్షాలవాళ్లు… ఆ తర్వాత కర్రలు, గొడ్డళ్లతో దాడులు చేసుకున్నారు. వారి వారి కుటుంబసభ్యులు వచ్చిన కొట్టుకుంటున్నవారిని అడ్డుకునే ప్రయత్నంచేశారు. మధ్యవర్తులు విడదీయంతో.. గొడవ సద్దుమణిగింది.

ఈ ఘర్షణలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Latest Updates