టీడీపీకి తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ రాజీనామా

tdp-youth-president-devineni-avinash-likely-to-join-ysrcp

టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింది.  ఓ వైపు ఇసుక పాలసీకి వ్యతిరేకంగా విజయవాడ ధర్నాచౌక్ లో చంద్రబాబు 12గంటల దీక్ష చేస్తుంటే…ఆ పార్టీకి చెందని కీలక నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పార్టీ అధిష్టానంతో పాటు పలువురు కీలక నేతలపై గుర్రుగా ఉన్న తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీసభ్యుత్వానికి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన లేఖను కేంద్ర కార్యాలయాన్ని పంపించారు.

ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత జరిగిన పరిణామాలపై అవినాష్ కలత చెందినట్లు సమాచారం. తాను పోటీ చేయనన్న బలవంతంగా కొడాలి నానిపై పోటీ చేయించడం, ఎన్నికల్లో ఓడిపోవడం, జిల్లాలో నాయకులు సముచిత స్థానం ఇవ్వక పోవడంపై మనస్థాపానికి గురైన అవినాష్ వైసీపీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా అవినాష్ తన ముఖ్య అనుచరులతో భేటీ అయినట్లు, భేటీలో  పార్టీ మారితే బాగుటుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

గతంలో తెలుగు యువత అధ్యక్షుడు పార్టీ మారుతున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తల్ని అవినాష్ కొట్టిపారేశారు. కానీ ఈ సారి మాత్రం పార్టీ లో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై అసమ్మతి వ్యక్తం చేస్తున్న అవినాష్ పార్టీ మారడంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈనేపథ్యంలో దేవినేని అవినాష్ రాజీనామా చేయడం టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది.

Latest Updates