లవ్ కంటే టీ చాలా బెటర్.. ఓ భగ్న ప్రేమికుడి టీస్టాల్ వైరల్

  • లవ్ బ్రేకప్ కావడంతో టీపాయింట్ పెట్టుకున్న ప్రేమికుడు
  • లవ్ ఫెయిల్యూర్‌కు టీ ఒక పరిష్కారమంటున్న యువకుడు

ప్రేమ సక్సెస్ అయితే ఆ అనుభూతి చెప్పలేనిది. అదే ప్రేమ విఫలమైతే.. ఆ బాధ ఊహించలేనిది. ప్రేమలో గెలిచినవాళ్లు ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంటారు. అదే ప్రేమలో ఓడినవాళ్లు.. జీవితం మొత్తం కోల్పోయినట్లుగా కనిపిస్తారు. కానీ డెహ్రడూన్‌కు చెందిన ఓ యువకుడు మాత్రం ప్రేమలో ఓడానని ఏమాత్రం నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా.. మిగతావారికి స్ఫూర్తిగా నిలవాలనుకున్నాడు. తనలా ప్రేమలో విఫలమైనవాళ్లలో మార్పు రావాలని కోరుకుంటూ.. ‘దిల్ టుటా ఆషిక్ చాయ్ వాలా’ అనే టీపాయింట్‌ను ప్రారంభించాడు.

డెహ్రడూన్‌కు చెందిన 21 ఏళ్ల దివ్యాన్షు బాత్రా లాక్‌డౌన్ సమయంలో తన ప్రేయసితో విడిపోయాడు. దాంతో కొంతకాలం ఆ బాధను భరించిన దివ్యాన్షు.. ఆరు నెలల తర్వాత తన తమ్ముడు రాహుల్ బాత్రాతో కలిసి డిసెంబర్ 16న ఈ టీపాయింట్‌ను ఏర్పాటుచేశాడు. దీనికోసం వారిద్దరూ పొదుపు చేసుకున్న డబ్బును ఉపయోగించారు. ఈ టీపాయింట్‌లో టీతో పాటు, మోమోస్ మరియు ఫ్రైస్ వంటి స్నాక్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఈ టీపాయింట్ బోర్డు మీద ‘నా మాట వినండి.. ప్రేమ కంటే టీ చాలా బెటర్’మరియు ‘విఫల ప్రేమకు టీ ఒక పరిష్కారం’ అని దివ్యాన్షు రాయించాడు. ఇలాంటి కొటేషన్స్‌తో ఏర్పాటు చేసిన ఈ టీపాయింట్ ఆ ఏరియాలో చాలా ఫేమస్ కావడంతో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

For More News..

ఫ్లెక్సీలు కడితే అధికార పార్టీకి ఫైన్‌లు వేయరా?

ప్రమాణస్వీకారం తర్వాత బిడెన్ చదివేది మన వినయ్ రెడ్డి రాసిన స్పీచే

ఇంటి ముందున్న చెట్టు నరికిన యజమానికి భారీ ఫైన్..

Latest Updates