ఆత్మహత్యలొద్దు.. కలిసి పోరాడుదాం: ఆర్టీసీ సమ్మెకు TEA మద్దతు

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పలు ఉద్యోగ సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే టీఎన్జీవో, టీజీవో, రెవెన్యూ ఉద్యోగ సంఘాలు.. వారి పోరాటానికి అండగా ఉంటామని ప్రకటించాయి. ఇవాళ తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపింది.

హైదరాబాద్ లిబర్టీలోని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (TEA)   కార్యాలయంలో ఆ సంఘం నాయకులను ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి సహా పలువురు కార్మిక నేతలు కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు ప్రకటించారు.

అన్ని సంఘాల్ని ఏకం చేసి పోరాడుదాం

ఆర్టీసీ కార్మికులు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకోవడం ఎంతో బాధాకరం అని TEA అధ్యక్షుడు సంపత్ కుమార్ స్వామి అన్నారు. ఎవరు ఆత్మహత్యలు చేసుకోకుండా పొరాటాలతో హక్కులు సాధించుకుందామని చెప్పారు. ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. మిగతా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ఏకం చేసి పోరాటాన్ని ఉద్ధృతం చేద్దామని చెప్పారు.

Latest Updates