అరటిపండ్లు అమ్ముతున్న టీచర్

నెల్లూరు: కరోనా వైరస్ నియంత్రణ కోసం విధించిన లాక్ డౌన్ నెల్లూరులో  ఓ స్కూల్ టీచర్ ను వీధి వ్యాపారిగా  మార్చింది. 15 ఏళ్లుగా ఓ ప్రైవేట్ స్కూలులో ఆయన టీచర్ గా పనిచేస్తుండగా..లాక్ డౌన్ లో జీతాలు ఇవ్వలేమని ఆ స్కూల్ యాజమాన్యం తెగేసి చెప్పింది. దీంతో అతని బతుకుచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. అ.. అంటే అరటిపండు అని పిల్లలకు పాఠాలు చెప్పిన ఆ టీచర్.. ఇప్పుడు అవే అరటిపండ్లు అమ్ముతున్నాడు. కుటుంబ పోషణ కోసం రోడ్లపై తిరుగుతూ తోపుడుబండితో అరటిపండ్లు అమ్ముతూ తన బతుకుబండిని లాగుతున్నాడు ఈ టీచర్. లాక్ డౌన్ తో చాలామంది పరిస్థితి ఇలాగే మారిందంటున్నారు ప్రజలు.

Latest Updates