
ఎన్నికల అధికారులపై ఉపాధ్యాయుల ఆగ్రహం
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో గందరగోళం నెలకొంది. టీచర్లు తప్ప మిగతా అన్ని డిపార్ట్ మెంట్ల ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ డ్యూటీ వేసిందని ఉపాధ్యాయ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రైనింగ్ ఇవ్వకుండా డైరెక్ట్ గా పోలింగ్ ఆఫీసర్ గా డ్యూటీ లు వేస్తున్నారని, పోలింగ్ ఆఫీసర్ లకు కనీసం 3 రోజుల ముందు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే ఉద్యోగులు గొడవ చేయడంతో ఎన్నికల అధికారులు అప్పటికప్పుడు ట్రైనింగ్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఖచ్చితం గా డ్యూటీ లో పాల్గొనాలని,పాల్గొనకుంటే యాక్షన్ తీసుకుంటామని అధికారులు భయపెట్టిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.