ఈ-లెర్నింగ్ జాబ్​ల కోసం ప్రైవేట్ టీచర్ల అప్లికేషన్లు

ఈ-లెర్నింగ్ జాబ్​ల కోసం ప్రైవేట్ టీచర్ల అప్లికేషన్లు
  • ఆన్​లైన్​, ట్యూటరింగ్ అకాడమీలకు అప్లై చేసుకునేటోళ్లు ఎక్కువైతున్నరు
  • ప్రైవేట్ టీచర్ల నుంచే ఎక్కువగా అప్లికేషన్లు
  • గతేడాది వందల మందిని రిక్రూట్ చేసుకున్న కంపెనీలు
  • ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియన్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆధారంగా జాబ్స్ ఆఫర్​

“ స్కూల్​టీచింగ్ లో నాలుగేళ్ల ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీరియన్స్ ఉంది. సోషల్ సబ్జెక్ట్ చెప్పేదాన్ని. కరోనాతో జాబ్ పోయింది. ఎడ్యుకేషన్ అంతా డిజిటల్ కి షిఫ్ట్ అవుతుండగా ఈ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-లెర్నింగ్ కంపెనీలో జాబ్ కోసం ట్రై చేశా. ప్రాసెస్ లోనే ఆగిపోతుంది. సబ్జెక్ట్ నాలెజ్డ్ ఉన్నా మిగతా స్కిల్స్ కూడా తెలుసుండాలి. ఫిజికల్ గా  చెప్పడం ఈజీ. కానీ లైవ్ క్లాసుల్లో కష్టం. ఆ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నా. అవకాశాలున్నా కొన్ని బేసిక్ స్కిల్స్ కూడా కావాలి. ” అని మల్కాజిగిరికి చెందిన ప్రైవేట్ టీచర్ లక్ష్మి చెప్పారు. 

హైదరాబాద్, వెలుగు: స్కూల్స్ ఫిజికల్ గా రీ ఓపెన్ అయినా ఇంకా తక్కువమంది టీచర్లతోనే క్లాసులు చెప్పిస్తున్నాయి మేనేజ్​మెంట్. వారికి కూడా గంటల లెక్కన, సబ్జెక్ట్ ని బట్టి శాలరీలు చెల్లిస్తున్నాయి. ఇలా జాబ్​ చేస్తున్న టీచర్లలో 50 శాతం ఉండగా, కొందరు ప్రైవేట్ ట్యూటర్లుగా చేస్తుండగా, మరికొందరు ఈ–లెర్నింగ్ కంపెనీలో జాబ్​ల కోసం ట్రై చేస్తున్నారు. దీంతో ఆన్​లైన్​ఎడ్యుకేషన్ కంపెనీలకు, ట్యూటరింగ్ అకాడమీలకు జాబ్ కావాలంటూ అప్లికేషన్లు చేస్తున్నవారి సంఖ్య పెరిగింది. ఆన్​లైన్​ సైట్లలో టీచర్లకు డిమాండ్ ఉన్నా క్వాలిఫికేషన్, టెక్నికల్ స్కిల్స్, సబ్జెక్ట్ నాలెజ్డ్ కంపల్సరీ ఉండాల్సి ఉండగా చాలామందికి అవకాశాలు దొరకడం లేదు. అప్లికేషన్లైతే ఎక్కువగా వస్తున్నాయని, క్వాలిఫికేషన్ కి తగినట్టుగా జాబ్​లు కల్పించలేకపోతున్నామని ఈ– లెర్నింగ్ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.  ఈ-లెర్నింగ్, ట్యూటర్స్ అకాడమీల్లో జాబ్​ల కోసం ప్రైవేట్ టీచర్ల నుంచి అప్లికేషన్లు పెరిగాయి. 

ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​తో డిమాండ్​
కరోనా కారణంగా 90 శాతం మంది ప్రైవేట్ టీచర్లు జాబ్​లు కోల్పోయినది తెలిసిందే. ఇందులో 20, 30శాతం మంది పూర్తిగా టీచింగ్ ఫీల్డ్ వదిలేసి వేరే జాబ్​లు, బిజినెస్​ల వైపు వెళ్లిపోయారు. ఉన్న టీచర్లు మాత్రం టీచింగ్​లోనే ఉండి ట్యూటర్లుగా మారడం,  ఈ–ఎడ్యుకేషన్ కంపెనీల్లో జాయిన్ అవడం చేస్తున్నారు.  ఆన్​లైన్​ప్లాట్ ఫామ్ కి స్టడీస్​కు షిఫ్ట్ అవగా టీచర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో టీచింగ్ ట్రైనింగ్ కంపెనీల ద్వారా, డైరెక్ట్ గా కూడా ఈ– -లెర్నింగ్ కంపెనీలైన వైట్ హాట్, వేదాంతు, బైజూస్ లాంటి టీచర్లను రిక్రూట్​ చేసుకుంటున్నాయి. అయితే టీచర్ల అన్ని రకాల క్వాలిఫికేషన్లు, ఆన్​లైన్​ టీచింగ్​స్కిల్స్​చూసి తీసుకుంటున్నాయి. 

స్కిల్స్ లేకపోతుండగా..
ఆన్​లైన్​లో టీచింగ్​చేసేందుకు మొదట్లో టీచర్లు అప్లికేషన్లు, సెట్టింగ్స్, టెక్నికల్ స్కిల్స్ లేకపోవడం లాంటి పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  ఇప్పుడు ఈ–లెర్నింగ్ సైట్లలో జాబ్ పొందాలన్నా ఇవే ప్రాబ్లమ్స్​గా ఉంటున్నాయి. దీంతో కొంతమంది టీచర్లు టెక్నికల్ స్కిల్స్ పై పట్టు కోసం యూట్యూబ్ లో వీడియోలు చూడటం, ప్రాక్టికల్ గా నేర్చుకోవడం వంటివి చేస్తూ ఆ తర్వాత ఈ– లెర్నింగ్​జాబ్​కు ట్రై చేస్తున్నారు.  ఆన్​లైన్​టీచింగ్​బాబ్​లకు సెలెక్ట్​ కాని వారు తమ ప్రాంతంలోనే ప్రైవేట్ గా ట్యూషన్లు చెప్పుకుంటున్నారు. మరికొంతమంది టీచర్లు గ్రూప్ గా ఏర్పడి ఆన్​లైన్​లెర్నింగ్ ఇనిస్టిట్యూషన్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి టెన్త్​క్లాసు వరకు అన్ని సబ్జెక్ట్ ల్లో ఎక్స్ పీరియన్స్ టీచర్స్ తమ బయోడేటాతో ఆన్​లైన్​, పేపర్స్ లో యాడ్స్ ఇస్తున్నారు. పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు ఇంట్రెస్ట్​ చూపని పేరెంట్స్​కాంటాక్ట్​ అయితే వారి ఇండ్లకు వెళ్లి క్లాసులు చెబుతున్నారు. క్లాస్, సబ్జెక్ట్ వైజ్ గా ఫీజు చార్జ్ చేస్తున్నారు. ఇలా నెలకి 3 వేల నుంచి 15 వేల వరకు తీసుకుంటున్నారు.  

ఎలా అప్రోచ్ ​అవ్వాలో  తెలియక..
కరోనా తర్వాత స్కూళ్ల బంద్​తో ఆన్​లైన్​ఎడ్యుకేషన్ కంపెనీలు అప్రోచ్ అయ్యాయి. జాబ్ మేళాలు కండెక్ట్​ చేసి టీచర్లను తీసుకున్నాం. వాళ్లు స్టూడెంట్స్ కు డౌట్స్ సాల్వ్ చేయడం, క్లాసెస్ తీసుకోవడం చేస్తుంటారు.  ఆన్​లైన్​ఎడ్యుకేషన్ కంపెనీలు టీచర్ బయోడేటా చూశాకే, యూజ్ అవుతారని కన్ఫర్మ్​చేసుకున్నాకే హైర్ చేసుకుంటాయి. చాలామంది టీచర్లు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక జాబ్​లు పొందలేకపోతున్నారు. 
- వరుణ్, టీచర్ రీడిఫైనింగ్, ఎడ్యుకేషన్ వెబ్ సైట్ 

అవసరమైన సబ్జెక్ట్​ టీచర్లనే రిక్రూట్..
స్కూల్స్ రీ ఓపెన్ అయినా టీచర్లను పూర్తిగా రిక్రూట్​చేసుకోలేదు. ఆన్​లైన్​లో క్లాసులు చెప్పిన టీచర్లతో పాటు అవసరమైన సబ్జెక్ట్​ టీచర్లనే అపాయింట్ చేసుకున్నారు. వారికి కూడా శాలరీలు తక్కువగానే ఇస్తున్నారు. చాలామంది టీచర్లు హోమ్ ట్యూటర్లుగా మారిపోయారు. 
- శివరాజ్, ప్రైవేటు టీచర్, టీపీటీఎఫ్