మా బడిలోనే చదివిస్తం : హెడ్ మాస్టర్ ఆలోచన..క్లాసులన్నీ హౌజ్ ఫుల్

నిజామాబాద్‌‌‌‌ జిల్లా కమ్మర్‌‌‌‌పల్లి మండలంలో చౌట్‌‌‌‌పల్లి జిల్లా పరిషత్‌‌‌‌ హైస్కూల్‌‌‌‌లో టీచర్లే కాదు స్టాఫ్‌‌‌‌, హెడ్‌‌‌‌మాస్టర్‌‌‌‌‌‌‌‌ పిల్లలు కూడా చదువుతున్నారు. అయితే.. ఈ ఆదర్శం వెనుక పెద్ద కథే ఉంది. అది అరవై ఏళ్ల చరిత్ర. చౌట్‌‌‌‌పల్లిలో 1957లో హైస్కూల్‌‌‌‌ పెట్టారు. ఆర్మూర్‌‌‌‌‌‌‌‌ డివిజిన్‌‌‌‌లోనే ఇది రెండో  హైస్కూల్‌‌‌‌. కొన్నేళ్ల పాటు ఎంతో వైభవంగా ఉండేది. ఎంతోమందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దింది ఈ స్కూల్‌‌‌‌. ఇక్కడ చదువుకున్న కొన్ని వందల మంది గవర్నమెంట్‌‌‌‌ ఉద్యోగాలు సాధించారు. కానీ.. కొన్నేళ్ల తర్వాత ప్రైవేట్‌‌‌‌ స్కూళ్ల ప్రభావం బాగా పెరిగింది. దాంతో అంతా తమ పిల్లలను ప్రైవేట్‌‌‌‌ స్కూళ్లకు పంపించడం మొదలుపెట్టారు. ఇలా ఆ స్కూల్‌‌‌‌లో రోజురోజుకు స్టూడెంట్స్‌‌‌‌ సంఖ్య తగ్గుతూ వచ్చింది. స్కూల్‌‌‌‌లో పిల్లలను చేర్పించేందుకు టీచర్లు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. పిల్లలను చేర్పించాలని టీచర్లు, పేరెంట్స్‌‌‌‌ దగ్గరకు వెళ్లిన ప్రతిసారి చేదు అనుభవమే ఎదురయ్యేది. ‘ముందు మీ పిల్లల్ని గవర్నమెంట్‌‌‌‌ స్కూల్‌‌‌‌లో చేర్పించండి.. ఆ తర్వాత మా పిల్లలను
చేర్పిస్తాం’ అనేవాళ్లు. దానికి తోడు పదో తరగతి పాస్‌‌‌‌ పర్సెంటేజ్‌‌‌‌ ప్రతి సంవత్సరం తగ్గుతూ వచ్చింది.

హెడ్‌‌‌‌మాస్టర్‌‌‌‌ గంగాధర్‌‌‌‌ చొరవతో..

2015 ఆగస్టులో ఆ పక్కనే బహీరాబాద్‌‌‌‌ హైస్కూల్‌‌‌‌లో పనిచేస్తున్న హెడ్‌‌‌‌మాస్టర్‌‌‌‌ గంగాధర్‌‌‌‌ చౌట్‌‌‌‌పల్లి హైస్కూల్‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ అయ్యి వచ్చారు. అప్పుడు ఆ స్కూల్‌‌‌‌లో 189 మంది స్టూడెంట్స్‌‌‌‌ ఉన్నారు. బహీరాబాద్‌‌‌‌ స్కూల్‌‌‌‌ను జిల్లాలోనే టాప్‌‌‌‌ స్కూళ్ల పక్కన చేర్చిన ఆయనకు చౌట్‌‌‌‌పల్లి హైస్కూల్‌‌‌‌ను మార్చడం ఓ సవాల్‌‌‌‌గా మారింది. అందుకే ఆయన ముందుగా తన కూతుర్ని ఆ స్కూల్‌‌‌‌లో జాయిన్‌‌‌‌ చేశారు. తర్వాత అడ్మిషన్ల కోసం ఊళ్లోకి వెళ్లారు. ‘మా అమ్మాయిని మా స్కూల్‌‌‌‌లోనే చదివిస్తున్నా. మీరు కూడా చేర్పించండి’. అంటూ పేరెంట్స్‌‌‌‌కు భరోసా కల్పించారు. పేరెంట్స్‌‌‌‌ మీటింగ్స్‌‌‌‌, గ్రామసభలు పెట్టి స్కూల్‌‌‌‌పై వాళ్లకు  నమ్మకం కలిగించారు. స్కూల్‌‌‌‌ పరిసరాలను కూడా పూర్తిగా మార్చేశారు. దాతల సహకారంతో స్కూల్‌‌‌‌ను అందంగా తీర్చిదిద్దారు. స్కూల్‌‌‌‌ అభివృద్ధి కోసం 4.50లక్షల రూపాయలు జమ చేసి ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డిపాజిట్‌‌‌‌ చేశారు. ప్రతినెలా దానిపై వచ్చే వడ్డీ ఏడు వేల రూపాయలను స్కూల్‌‌‌‌ అవసరాలకు వాడుతున్నారు. బడిలో వచ్చిన మార్పులతో పిల్లల సంఖ్య ఏటా పెరుగుతూ వచ్చింది. దీంతో 2019 నాటికి ఆ సంఖ్య 350కి చేరింది. నాలుగేళ్లలో పదో తరగతిలో 100% పాసయ్యారు. అంతేకాదు నలుగురికి 10 జీపీఏ వచ్చింది. ప్రస్తుతం ఈ స్కూల్‌‌‌‌లో నలుగురు టీచర్ల పిల్లలు, ఒక బ్యాంక్‌‌‌‌ ఎంప్లాయ్‌‌‌‌ పిల్లలు చదువుతున్నారు. ఈ స్కూల్‌‌‌‌ను ఇంతలా డెవలప్‌‌‌‌ చేసినందుకు హెడ్‌‌‌‌మాస్టర్‌‌‌‌‌‌‌‌ గంగాధర్‌‌‌‌కు తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ టీచర్‌‌‌‌ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును ఆయన ఈ రోజు హైదరాబాద్‌‌‌‌లో రవీంద్రభారతిలో అందుకోనున్నారు.

 -గండ్ర నవీన్ , హైదరాబాద్

బడిపై నమ్మకం కల్పిస్తే చాలు

నేను ఇంతకుముందు హాసకొత్తూర్‌ , బషీరాబాద్‌ స్కూళ్లలో పనిచేశా. నా ముగ్గు రు పిల్లలను ఆ స్కూళ్లలోనే చదివించా. నా పెద్ద కూతురు
మనీషా ప్రస్తుతం ఎస్‌ జీటీ టీచర్‌. పేరెంట్స్‌ లో సర్కారు బడిపై నమ్మకం కల్పిస్తే అడ్మిషన్లు ఆటోమెటిక్‌ గా పెరుగుతాయి. మా స్కూల్‌ లో గవర్నమెంట్‌‌‌‌ టీచర్ల పిల్లలతో పాటు అంగన్‌ వాడీ టీచర్‌, ఆశావర్కర్స్‌ పిల్లలు కూడా చదువుతున్నారు. పేరెంట్స్‌ తో మీటింగ్‌ లు పెట్టి, పిల్లల
పర్ఫార్మెన్ స్‌ చెప్పి, వాళ్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటుంటాం. రోజూ ఉదయం 8 గంటల నుం చి సాయంత్రం 6.30 గంటల వరకూ
బడిలోనే ఉంటా. సాయంత్రం పిల్లలతో హోంవర్క్‌‌‌‌ చేయిస్తా. అందుకే టెన్త్‌‌‌‌లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. స్టేట్‌‌‌‌ బెస్ట్‌‌‌‌ టీచర్‌ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది.

      – గంగాధర్‌‌‌‌, హెడ్‌‌‌‌మాస్టర్‌‌‌‌

Latest Updates