టీమిండియాకు భారీ జరిమానా

న్యూజిలాండ్  పర్యటనలో ఉన్న భారత జట్టుకు వరుస జరిమానాలు తప్పడంలేదు. టీమిండియాకు ICC భారీ జరిమానా విధించింది. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో  ఏకంగా 80 శాతం కోత విధించింది. సకాలంలో ఓవర్లు వేయకపోవడమే దీనికి కారణం.

ఇప్పటికే T20 సిరీస్ లో చివరి రెండు మ్యాచ్ ల్లో స్లో ఓవర్ రేట్  కారణంగా.. నాలుగో T20 మ్యాచ్ లో 40 శాతం..ఐదో T20లో 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించింది. ఇప్పుడు వన్డేలో మరింత షాకిచ్చింది. నిర్ణీత సమయానికి టీమిండియా 4 ఓవర్లు ఆలస్యమైనట్టు గుర్తించారు ఐసీసీ క్రిస్ బ్రాడ్. ఒక్కో ఓవర్ కు 20 శాతం చొప్పున మొత్తం 80 శాతం జరిమానా విధించారు. దీనికి సంబంధించి మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ విచారణ జరపగా… టీమిండియా సారథి కోహ్లీ తప్పిదాన్ని అంగీకరించడంతో విచారణ ఉండదు.

Latest Updates