వరల్డ్ కప్‌లో టీమిండియా జెర్సీ మారింది

మెన్ ఇన్ బ్లూ.. ఆరెంజ్ ఆర్మీగా మారబోతున్నారు. బ్లూ బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్న భారత క్రికెట్ జట్టు… కీలకమైన వరల్డ్ కప్ లో నారింజ రంగు దుస్తులు ధరించబోతున్నారు. టీమిండియాకు కొత్త జెర్సీని సూచించింది ఐసీసీ. అదే ఆరెంజ్ జెర్సీ. ఆ డిజైన్ ను ఇవాళ అధికారికంగా ప్రకటించారు. జూన్ 30న ఇంగ్లండ్ తో జరగనున్న లీగ్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ గ్యాంగ్ ఆరెంజ్ జెర్సీలో కనిపించే అవకాశాలున్నాయి.

దాదాపుగా సేమ్ కలర్ జెర్సీ ఉన్న జట్ల మధ్య మ్యాచ్ జరిగే సందర్భంలో జెర్సీ మార్పు అనేది ఈ వరల్డ్ కప్ లో అమలు చేస్తున్నారు. టోర్నీకి ముందే అన్నిదేశాల క్రికెట్ బోర్డులకు ఈ సూచనలు ఇచ్చారు. ఆదేశాల ఆటగాళ్లు ధరించే జెర్సీల్లో ఉన్న రంగులను ఆధారంగా చేసుకుని.. యూఎస్ఏలో ఉన్న క్రీడా నిపుణులు కొత్త జెర్సీలను రూపొందించారు. ఇండియా జెర్సీలో కాషాయ రంగు ఉంటుంది. అదే రంగును హైలైట్ చేస్తూ… ఆరెంజ్ జెర్సీని డిజైన్ చేశారు. బీసీసీఐకి ఇచ్చిన డిజైన్లలో ఇదే డిజైన్ ను ఎంపిక చేసినట్టు ఐసీసీ అధికారులు తెలిపారు.

వరల్డ్ కప్ ను నిర్వహిస్తున్న లోకల్ టీమ్ ఇంగ్లండ్ ఇప్పటికే బ్లూ కలర్ జెర్సీని వాడుతోంది. స్థానిక జట్టు కనుక ఆదేశానికి ఇచ్చిన వెసులు బాటు ప్రకారం.. ఇండియాతో ఆడే మ్యాచ్ లో ఆ జట్టు నీలం రంగు దుస్తులే వేసుకునే అవకాశం ఉంది. ఇండియన్ ప్లేయర్లు అప్పుడు నారింజ రంగు దుస్తులు వేసుకుంటారు.

 

 

Latest Updates