ఆంటిగ్వా టెస్టు : ప్రారంభంలోనే 3 వికెట్లు కోల్పోయిన భారత్

ఆంటిగ్వా: వెస్టిండీస్‌ తో జరుగుతున్న తొలి టెస్టులో విండీస్‌ బౌలర్లు చెలరేగుతున్నారు. పిచ్‌ పై ఉన్న తేమను క్యాష్ చేసుకుంటూ టీమిండియా టాప్‌ ఆర్డర్‌ ని పెవిలియన్ కు పంపారు. భారత్ కు మంచి ప్రారంభం దక్కలేదు. కీలకమైన 3 వికెట్లు తీసిన విండీస్ బౌలర్లు మ్యాచ్‌ పై పట్టు సాధించారు.

కీమర్‌ రోచ్‌ బౌలింగ్‌ లో ఐదో ఓవర్‌ లో మయాంక్‌ అగర్వాల్‌ (5), పుజారా(2) కీపర్‌ షైహోప్‌ కు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యారు. గాబ్రియల్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(9) ఔటయ్యాడు. దీంతో ఎనిమిది ఓవరల్లకు టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 25 రన్స్ మాత్రమే చేసింది. ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌,  అజింక్య రహానె బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో విండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.

 

 

Latest Updates