వెనక్కు వచ్చెయ్‌‌.. వద్దు అక్కడే ఉండు

టీమిండియా మేనేజర్‌‌పై వేటు ఉపసంహరణ

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌‌లోని ఇండియా హై కమిషన్‌‌ అధికారులతో అమర్యాదగా ప్రవర్తించిన టీమిండియా అడ్మినిస్ట్రేటివ్‌‌  మేనేజర్‌‌ సునీల్‌‌ సుబ్రమణియమ్‌‌పై వేటు వేసి తక్షణమే స్వదేశానికి రావాలని ఆదేశించిన బీసీసీఐ వెంటనే మనసు మార్చుకుంది. జరిగిన ఘటనపై సునీల్‌‌ భేషరతు క్షమాపణలను అంగీకరించిన సీవోఏ చీఫ్‌‌ వినోద్‌‌ రాయ్‌‌..  మందలిపుతో సరిపెట్టి, జట్టుతో పాటు ఉండొచ్చని బుధవారం  ప్రకటించారు.

ఇండియన్‌‌ గవర్నమెంట్‌‌ ఆదేశాల మేరకు టీమిండియా క్రికెటర్లతో వాటర్‌‌ కన్జర్వేషన్‌‌ (జల సంరక్షణ)పై వీడియోలు షూట్‌‌ చేసేందుకు సహకరించాలని కమిషన్‌‌ సీనియర్‌‌ అధికారులు సుబ్రమణియమ్‌‌ను కోరారు. దీనికి నిరాకరించిన అతను ‘మేసెజ్‌‌’లతో ఎందుకు విసిగిస్తున్నారని అనుచితంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని హై కమిషన్‌‌ వెంటనే బీసీసీఐ అధికారులకు తెలియజేసింది. దీనిపై సీరియస్‌‌ అయిన సీఓఏ.. అందుబాటులో ఉన్న ఫ్లైట్‌‌లో తక్షణమే ఇండియాకు రావాలని తొలుత ఆదేశించింది. ఫ్లైట్‌‌ టికెట్స్‌‌ కూడా బుక్‌‌ చేసింది. అయితే, ఒత్తిడి వల్లే అలా చేయాల్సి వచ్చిందంటూ, ఈ మొత్తం వ్యవహారంపై సుబ్రమణియమ్‌‌.. హై కమిషన్‌‌ అధికారులకు క్షమాపణలు చెప్పాడు.

‘అది ప్రభుత్వ ఆదేశమని సునీల్‌‌కు తెలియదు. తొలుత నేను కూడా అతడిని ఇండియాకు తిరిగి రప్పించాలని భావించా. కానీ ఈ రోజు సాయంత్రం సునీల్‌‌ క్షమాపణ చెప్పారు. దాంతో, టూర్‌‌ ముగిసేంతవరకూ కొనసాగించాలని నిర్ణయించాన’ని రాయ్‌‌ తెలిపారు.

Latest Updates