మూడేళ్లుగా ట్రైనింగ్: ఫ్లూట్ వాయిస్తున్న శిఖర్ ధావన్…

టీమిండియా  ఓపెనర్  బ్యాట్స్  మెన్  శిఖర్ ధావన్ కొత్త అవతారం ఎత్తాడు.  విండీస్ తో టెస్ట్ సిరీస్ కు  దూరంగా ఉన్న గబ్బర్ సింగ్….  కృష్ణుడిలా ఫ్లూటు వాయిస్తున్నాడు.  ప్రస్తుతం తిరువనంతపురంలో  దక్షిణాఫ్రికా-A జట్టుతో  ఆడుతున్న ధావన్…  మ్యాచ్ ల మధ్య  ఖాళీ సమయంలో  వేణుగానం చేస్తున్నాడు.  ఇప్పటికే గురువు వేణుగోపాలస్వామి వద్ద ప్లూట్  వాయించటంలో ప్రావీణ్యం సాధించినట్లుగా తెలిపాడు ధావన్. అయితే ప్రస్తుతం… కేరళ సముద్రపు ఒడ్డున ఫ్లూట్ వాయించిన వీడియోను  ట్వీట్టర్ లో  పోస్ట్ చేశాడు. వేణుగానం వాయిస్తూ.. ప్రకృతి అందాలను  ఆస్వాధిస్తున్న వీడియో నెట్ లో వైరల్ గా మారింది.

Latest Updates