వేటు వేసేముందు ధోనీకి చెప్పండి : సెహ్వాగ్

టీమిండియా క్రికెటర్ మిస్టర్ కూల్ ధోనీ రిటైర్మెంట్ గురించి మాట్లాడారు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ధోనీపై ఒకవేళ వేటు వేయాలనుకుంటే ముందుగానే సెలక్టర్లు అతనికి ఒక మాట చెప్పాలని సెహ్వాగ్ సూచించాడు. వరల్డ్ కప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ ఊహించగా.. అతను మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. దీంతో.. వెస్టిండీస్ టూర్ కి ఆదివారం సెలక్టర్లు ప్రకటించనున్న క్రమంలో భారత్ టీమ్ పై జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రపంచకప్‌ లో ధోనీ పేలవ ప్రదర్శనతో.. అతనిపై వేటు వేస్తారా.. లేక టీమ్ లో చోటిస్తారా..అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. దీంతో.. కనీసం ధోనీ విషయంలోనైనా సెలక్టర్లు కాస్త హుందాగా వ్యవహరించాలని సెహ్వాగ్ సూచించాడు.  సెలక్టర్లకి నేను చెప్పేది ఒక్కటే.. క్రికెటర్లని టీమ్‌ నుంచి తప్పించే ముందు వారితో స్వయంగా ఒకసారి మాట్లాడండి’ అని సెహ్వాగ్ చెప్పాడు.

Latest Updates