నల్ల బ్యాడ్జీలతో గ్రౌండ్‌లోకి కోహ్లీ గ్యాంగ్

ఈ ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి బీసీసీఐ, భారత క్రికెట్ జట్టు నివాళి అర్పించింది. వెస్టిండీస్ తో తొలి టెస్ట్ ఆడుతున్న భారత జట్టు ఇవాళ మూడోరోజు ఆటలో.. జైట్లీ మృతికి నివాళిగా తమ మోచేతులకు నలుపు రంగు బ్యాండ్లు కట్టుకొచ్చారు.

అరుణ్ జైట్లీ ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గానూ పనిచేశారు. అరుణ్ జైట్లీ మృతి చెందారన్న వార్త కలచివేసిందని బీసీసీఐ ట్వీట్ చేసింది. జైట్లీ కుటుంబసభ్యులను బాధను పంచుకుంటున్నామని చెప్పింది. జైట్లీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేసింది.

జైట్లీ మరణవార్తపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ట్విట్టర్ లో తన సంతాప సందేశం పోస్ట్ చేశారు. అరుణ్ జైట్లీ.. ఎప్పుడూ సాటివారికి సాయం చేయాలనుకుంటారనీ.. నిజాయితీ ఉన్న మంచి మనిషి అని చెప్పారు కోహ్లీ. 2006లో తన తండ్రి చనిపోయినప్పుడు అరుణ్ జైట్లీ తమ ఇంటికి వచ్చి సానుభూతి ప్రకటించిన సంగతి గుర్తుచేసుకున్నారు కోహ్లీ.

Latest Updates