టీమిండియా vs కివీస్‌:  5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్‌‌లు

team-india-vs-kiwis-5-tea-20s-3-odis-and-2-tests

వెల్లింగ్టన్‌‌: వచ్చే ఏడాది ఆరంభంలో ఇండియా జట్టు.. న్యూజిలాండ్‌‌లో పర్యటించనుంది. జనవరి 24 నుంచి మార్చి 4 వరకు జరిగే ఈ టూర్‌‌లో టీమిండియా.. కివీస్‌‌తో 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్‌‌లు ఆడనుంది. రెండు టెస్ట్‌‌లకు వెల్లింగ్టన్‌‌, క్రైస్ట్‌‌చర్స్‌‌ ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే జనవరి 26న ఈడెన్‌‌ పార్క్‌‌లో రెండో టీ20 జరుగుతుందని, అభిమానులకు ఇదో పెద్ద పండుగ మాదిరిగా ఉంటుందని ఎన్‌‌జెడ్‌‌సీ చీఫ్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ డేవిడ్‌‌ వైట్‌‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆక్లాండ్‌‌ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉందన్నాడు. టీమిండియా టూర్‌‌ కంటే ముందు ఈ ఏడాది అక్టోబర్‌‌లో కివీస్‌‌.. ఇంగ్లండ్‌‌తో 5 టీ20లు, 2 టెస్ట్‌‌లు ఆడనుంది. న్యూజిలాండ్‌‌తో తొమ్మిదో టెస్ట్‌‌ వేదికైన బే ఓవల్‌‌లో ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్‌‌ జరుగనుంది.

Latest Updates