IPLపై ఎటూ తేల్చని టీమ్ ఓనర్లు

వేచి చూడాల్సిందే.. టెలీ కాన్ఫరెన్స్​ లో ఏ విషయమూ తేల్చని టీమ్ ఓనర్లు
న్యూఢిల్లీ: ఐపీఎల్ పదమూడో సీజన్​ నిర్వహణపై ఫ్రాంచైజీల ఓనర్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో లీగ్​ జరుగుతుందో లేదో చెప్పలేకపోతున్నారు. ఎనిమిది ఫ్రాంచైజీల ఓనర్లు సోమవారం టెలీ కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. కానీ, ఇందులో ఏ నిర్ణయమూ తీసుకోలేదని ఓ ఫ్రాంచైజీ యజమాని తెలిపాడు. ‘నేటి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదొక ఫాలో అప్​మీటింగ్ మాత్రమే. గత 48 గంటల్లో పరిస్థితుల్లో పెద్దగా మార్పులేం లేవు. దీనిపై ఓ నిర్ణయానికి రావడానికి వారానికో మీటింగ్​ జరుపుతాం ’ అని తెలిపారు.

Latest Updates