
బంగి: పైనాపిల్ చెట్టు వ్యర్థాలతో ఫైబర్ లాంటి మెటీరియల్‌ను చేయొచ్చంటే నమ్ముతారా? కానీ మలేషియన్ రీసెర్చర్స్ దీన్ని చేసి చూపించారు. పైనాపిల్ ఆకులు, కాండంతోపాటు వాటి వ్యర్థాలతో డ్రోన్‌ను తయారీ చేసి ఔరా అనిపించారు.
ఈ ప్రాజెక్టుకు ప్రొఫెసర్ మహ్మద్ తారిక్ హమీద్ సుల్తాన్ సారథ్యం వహించారు. కౌలాలంపూర్‌కు సమీపంలోని హులూ లాంగట్ అనే ప్రాంతంలో రైతులు పండించిన పైనాపిల్ చెట్ల వ్యర్థాలను డ్రోన్ల తయారీకి వినియోగించారు. పైనాపిల్ ఆకుల వ్యర్థాలను ఫైబర్‌లా తయారు చేశామని, వీటిని ఎయిరోస్పేస్లోనూ వినియోగించొచ్చునని ప్రొఫెసర్ తారిక్ చెప్పారు.