భారత జట్టు ఇదే : ఆస్ట్రేలియాతో టీ20, వన్డే మ్యాచ్ లు

ఆస్ట్రేలియాతో జరిగే రెండు టీ ట్వంటీలు, 5 వన్డే మ్యాచ్ లకు భారత టీంను ప్రకటించింది BCCI.  టీ20 సిరీస్ కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, KL రాహుల్, శిఖర్ ధవన్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, ధోనీ, హార్ధిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, విజయ్ శంకర్, చహల్, బుమ్రా, ఉమేష్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్, మయాంక్ మర్కాండేలను ఎంపిక చేశారు. టీ20లకు ముగ్గురు స్పిన్నర్లను.. నలుగురు పేసర్లను సెలక్ట్ చేశారు. 5 వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి మొదటి రెండు వన్డేలకు…… కోహ్లీ, రోహిత్ శర్మ, ధవన్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ధోనీ, హర్ధిక్ పాండ్యా, బుమ్రా, షమీ, చహల్, కుల్దీప్ యాదవ్, విజయ్ శంకర్, రిషబ్ పంత్, సిద్దార్థ్ కౌల్, KL రాహుల్ ను సెలెక్ట్ చేశారు.

తర్వాతి మూడు వన్డేలకు కోహ్లీ, రోహిత్, ధవన్, రాయుడు, జాదవ్, ధోనీ, హార్థిక్ పాండ్యా, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, చహల్, కుల్దీప్ యాదవ్, షమీ, విజయ్ శంకర్, రాహుల్, రిషబ్ పంత్ లకు చోటిచ్చారు.

టీ20, వన్డే సిరీస్ లకు విరాట్ కోహ్లీ యే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మ్యాచ్ లన్నీ ఇండియాలోనే జరగనున్నాయి. మొదటి టీట్వంటీ మ్యాచ్ ఫిబ్రవరి 24న విశాఖలో స్టాట్ అవుతుండగా….. మొదటి వన్డే మార్చ్ 2న హైదరాబాద్ లో జరుగుతుంది. టీ20లు, వన్డేలకు ప్రకటించిన అన్ని జాబితాల్లో రిషబ్ పంత్ కు చోటు దక్కింది. వన్డే ప్రపంచ కప్ ముందు రిషబ్ పంత్ కు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వనున్నట్టు చెప్పింది BCCI.

Latest Updates