సిరీస్ కైవసం: అమ్మాయిలు అదరగొట్టారు

నార్త్‌ సౌండ్‌: ఉమెన్స్ క్రికెట్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ విక్టరీ సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీ్‌స్ ను 2-1తేడాతో సొంతం చేసుకుంది మిథాలీసేన. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 10కోల్పోయి 194 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్  ఆడుతూపాడుతూ విజయం సాధించింది. 42 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి  195 రన్స్ తో విన్ అయ్యింది.

టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మందానా (74) ఎక్కువ రన్స్ తో చెలరేగగా జెమీమా రోడ్రిగ్స్‌  (69)తో అదరగొట్టింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్(20), పూనమ్ రౌత్ (24) ఆచితూచి ఆడుతూ మ్యాచ్ ను విక్టరీ దిశగా మలిచారు. ఫస్ట్ మ్యాచ్ లో ఒకే ఒక్క పరుగుతో ఓడిన భారత్..తర్వాత 2 మ్యాచుల్లో గెలిచి కప్ కొట్టేసింది.

Latest Updates