కదిలిస్తే కన్నీళ్లే: బిడ్డల ఫొటోల ముందు రోదన

సైకో శ్రీనివాస్ రెడ్డి చేతిలో హతమైన మనీష,కల్పన అస్థికల కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఎలాగూ కడసారి చూపునకు నోచుకోనివీరు కనీసం బావిలో దొరికిన బిడ్డల ఎముకలతోనైనా అంత్యక్రియలను చేద్దామని అనుకుం టున్నారు. పోలీసులు తమ బిడ్డల ఎముకలనుఎప్పుడు అప్పజెప్పుతారా అని ఎదురుచూస్తూ,బిడ్డల ఫొటోలను ముందు పెట్టుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. ఎవరు పలకరించినా కన్నీటిపర్యం తమవుతున్నారు. యాదాద్రి భువనగిరిజిల్లా బొమ్మలరామారం మండలం హాజిపురంగ్రామంలో సీరియల్‍ కిల్లర్‍, సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డి అదే గ్రామానికి చెందిన శ్రావణి(14),త్రిపురబోయిన మనీష(19), మైసిరెడ్డిపల్లిగ్రామానికి చెందిన కల్పన(11)ను చంపి పాడుబడ్డ బావుల్లో పాతిపెట్టిన విషయం తెలిసిందే .శ్రావణి మృతదేహాన్ని గత నెల 26న పాడుబడ్డ బావిలోంచి బయటకు తీసిన పోలీసులు, 27నభువనగిరి ఏరియా హాస్పి టల్​లో పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగిం చారు . అదేరోజు స్వగ్రామంలో శ్రావణి అంత్యక్రియలను పూర్తి చేశారు. నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డినిఅదుపులోకి తీసుకొని విచారించగా, అతడిచ్చిన సమాచారం మేరకు గత నెల 29న అదే పాడుబడ్డబావిలో మనీష(19) మృతదేహంతోపాటు కాలేజీ ఐడీకార్డు, ఆధార్ కార్డు, చెప్పులను వెలికి తీశారు.మార్చి 9న పాతిపెట్టిన మృతదేహం కావడంతో భూమిలోపల కుళ్లిపోయి చివరకు ఎముకలే మిగిలాయి. ఆ ఎముకలను పోలీసులు నాలుగుసంచుల్లో తీసుకువెళ్లారు. డాక్టర్లు , తహసీల్దార్,ఫోరెన్సిక్‍ డాక్టర్ సమక్షంలో పంచనామా నిర్వహించిన పోలీసులు, పరీక్షల నిమిత్తం ఆ ఎముకలను హైదరాబాద్ లోని ఫోరెన్సిక్‍ ల్యాబ్ కుపంపారు. ఆ మరుసటి రోజు 30న నాలుగేళ్లక్రితం కనిపించకుండా పోయిన కల్పన మృతదేహానికి సంబంధించిన 8 ఎముకలను మరోపాడుబడ్డ బావిలో వెలికి తీశారు. వీటితో పాటుచెప్పులు, మూడు డ్రెస్సులను స్వాధీనం చేసుకున్నారు.ఇందులో కల్పన ఎముకలతోపాటు ఇంకెవరివైనా ఉన్నాయా అని అనుమానిస్తూ డీఎన్‍ఏ పరీక్షనిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 1నఆమె తల్లిదండ్రులు భువనగిరి ఏరియా హాస్పిటల్​కు వచ్చినా డీఎన్‍ఏ పరీక్షల నిమిత్తం ఎలాంటిన మూనాలను తీసుకోలేదు. ఈ ఎముకలను కూడా పరీక్షల నిమిత్తం హైదరాబా ద్ లోని ఫోరెన్సిక్‍ ల్యాబ్ కు పంపారు. పరీక్షలు పూర్తయ్యాకరిపోర్టు వచ్చేందుకు నెల నుంచి రెండు నెలల సమయం పట్టనుంది. ఆ తర్వాతే ఎవరి ఎముకలను వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.

మనీష కుటుంబంలోనూ అదే పరిస్థితి……

మనీష(19) కుటుంబంలోనూ తీవ్ర విషాదంనెలకొంది. ఆమెకు తల్లి లేదు. తండ్రి మల్లేశం,ముగ్గురు అక్కలు ఉన్నారు.వీరి పెళ్లిళ్లు అయ్యాయి. మార్చి 9న కాలేజీకివెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన మనీషాతిరిగి రాలేదు. అయితే మనీష ప్రేమ పెళ్లి చేసుకొని ఎక్కడో ఉందనుకున్నారు. కానీ అనూహ్యంగా శ్రీనివాస్ రెడ్డికి చెందిన పాడుబడ్డ బావిలో మృతదేహం లభించడంతో తీవ్రవిషాదంలో మునిగిపోయారు. ఐదు రోజులుగామనీష ఫొటో ముందు అందరూ కలిసి రోదిస్తున్నారు. బంధువులు వచ్చిపోతున్నారు. మనీష ఎముకలన్నా ఇస్తే అంత్యక్రియలు చేస్తామనిచెబుతున్నారు.

నాలుగేళ్లుగా వేదన….

కల్పన అదృశ్యమైన నాలుగేళ్ల నుంచి ఆమెకుటుంబంలో విషాదం నెలకొం ది. తల్లిదండ్రులు భాగ్యమ్మ, నందం అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నారు. చెట్లు, పుట్టలు అన్నీఎత్తిపోశారు. చుట్టు పక్కల ఊర్లలోనూవెతికారు. యాదగిరిగుట్ట సెక్స్ రాకెట్ కేసులో 36 మంది ఆడపిల్లలు పట్టు బడ్డప్పుడు, అందులో మా బిడ్డ ఉందా అంటూ కల్పన ఫొటోతో అక్కడికొచ్చారు. లేదని తెలుసుకొని ఎక్కడుందో బిడ్డ, యాడ దొరుకుతుందో అంటూ రోదించారు. హాజిపురంలో శ్రావణి మృతదేహం బయల్పడగానేతమ బిడ్డనూ ఇలాగే చంపేసి ఉంటారనిఅనుమానం వెలిబుచ్చా రు. అనుమానిం చినట్టు గానే మూడు రోజుల తర్వాత శ్రీనివాస్ రెడ్డికి చెందిన మరో పాడుబడ్డబావిలో కల్పన మృతదేహానికి సంబంధిం చిన ఎముకలతో పాటు చెప్పులు, డ్రెస్సులులభించడంతో తమ బిడ్డ ఇక లేదని తెలుసుకొని గుండెలవిసేలా రోదిం చారు. ఇప్పుడు ఆఎముకలైనా ఇస్తే అంత్యక్రియలు చేసుకుంటామని ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వం నుంచి భరోసా ఏదీ?….

నరహంతకుడు శ్రీనివాస్ రెడ్డి చేతిలో దారుణంగా ముగ్గురు పిల్లలు బలైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసాలేదని బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శ్రావణిమృతదేహం బయల్పడి నప్పుడు రాచకొం డ కమిషనర్‍ మహేష్‍ భగవత్‍ వచ్చి వారు చెప్పిందివిన్నారు. జిల్లా కలెక్టర్‍ అనితారామచంద్రన్‍ హాస్పి టల్​ వద్ద కుటుంబ సభ్యులను ఓదార్చారు.కానీ ప్రభుత్వం తరఫున కనీస భరోసా లేదని కోపోద్రిక్తులవుతున్నారు. అంత్యక్రియలయ్యాక ఇంటికొచ్చి మాట్లాడి తగిన న్యాయం చేస్తామని, నిందితున్ని కఠినంగా శిక్షిస్తామని నమ్మకం కలిగించినవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణ సంఘటన జరిగినా సీఎంకేసీఆర్‍, కేటీఆర్‍, మంత్రులు ఎందుకు స్పందిం చడం లేదని ప్రశ్నిస్తు న్నారు.

శ్రీనివాస్ రెడ్డి కస్టడీకి పిటీషన్‍….

శ్రావణి, మనీషా, కల్పనలను దారుణంగా హత్య చేసిన మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టుచేసి భువనగిరి కోర్టులో హాజరు పరిచారు. జడ్జి 14 రోజుల రిమాండ్‍ విధిం చడంతో వరంగల్‍ జైలుకు తరలించారు. ఈ మర్డర్‍ కేసులను మరింత లోతుగా దర్యాప్తు చేయడంతోపాటు, శ్రీనివాస్ రెడ్డి ఇంకేమైనా నేరాలకు పాల్పడ్డా డా అని విచారించేందుకు కస్టడీకి తీసుకునేందుకుపోలీసులు శుక్రవారం నల్లగొండ కోర్టులో పిటీషన్‍ వేశారు. జడ్జి అనుమతిస్తే శ్రీనివాస్ రెడ్డినికస్టడీకి తీసుకొని విచారించనున్నారు.

Latest Updates