టెక్‌‌ మహీంద్రా సొల్యూషన్‌‌

ఇండియాలో టెలికం రంగంలో మొబైల్‌‌ స్పామింగ్‌‌ అరికట్టేందుకు బ్లాక్‌‌చైన్‌‌ టెక్నాలజీ సొల్యూషన్‌‌ను టెక్‌‌ మహీంద్రా లిమిటెడ్‌‌ అందుబాటులోకి తెచ్చింది. 30 కోట్ల మంది మొబైల్ కస్టమర్లు ఈ స్పామ్‌‌ కాల్స్‌‌ బారిన పడుతున్నట్లు అంచనా. ఇంతకు ముందు ఇండియాలోని టెలికం ప్రొవైడర్ల కోసం బ్లాక్‌‌చైన్‌‌ టెక్నాలజీతోనే మరో సొల్యూషన్‌‌ అందించినట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్ల డేటాను అనాథరైజ్డ్‌‌గా టెలికం ప్రొవైడర్లు పొందడాన్ని  ఈ సొల్యూషన్‌‌ అడ్డుకుంటుంది. ట్రాయ్‌‌ నిబంధనలకు అనుగుణంగా దానిని రూపొందించినట్లు టెక్‌‌ మహీంద్రా పేర్కొంది. 2030 నాటికి బ్లాక్‌‌చైన్‌‌ టెక్నాలజీ మార్కెట్‌‌ ట్రిలియన్‌‌ డాలర్ల మార్కెట్‌‌ అవుతుందని అంచనా వేస్తున్నామని టెక్‌‌ మహీంద్రా గ్లోబల్‌‌ ప్రాక్టీస్‌‌ లీడర్‌‌ రాజేష్‌‌ దుడ్డు తెలిపారు.  ప్రభుత్వాలకు, కార్పొరేట్లకు కూడా ఈ టెక్నాలజీ కీలకమవుతుందని పేర్కొన్నారు. బ్లాక్‌‌చైన్‌‌ టెక్నాలజీకి తమ కంపెనీ పెద్ద పీట వేస్తున్నట్లు వెల్లడించారు. టెలికం, మాన్యుఫాక్చరింగ్ హైటెక్‌‌ ఇండస్ట్రీస్‌‌, ఫైనాన్షియల్‌‌ సర్వీసెస్‌‌ రంగాలలో బ్లాక్‌‌చైన్ టెక్నాలజీ సొల్యూషన్స్‌‌పై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు.

Latest Updates