రామానంద తీర్థ​లో టెక్నికల్​ కోర్సులు

భూదాన్​ పోచంపల్లిలోని స్వామి రామానంద తీర్థ రూరల్​ ఇన్‌‌స్టిట్యూట్​ (ఎస్​ఆర్​టీఆర్​ఐ) వివిధ షార్ట్​టెర్మ్​ టెక్నికల్​ కోర్సుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. దీన్​ దయాళ్​ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం ద్వారా ఉపాధి ఆధారిత టెక్నికల్​ కోర్సుల్లో మూడు నెలల పాటు ట్రైనింగ్‌‌ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తారు.

గమనిక: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని యువతీయువకులు అర్హులు. చదువు కొనసాగిస్తున్న వారు అనర్హులు.

ఉచిత శిక్షణ, హాస్టల్ వసతి

ఎంపికయిన అభ్యర్థులకు మూడు నెలల పాటు హాస్టల్​ వసతి, భోజన సదుపాయం కల్పించి ఉచిత శిక్షణ ఇస్తారు. అనంతరం ఉద్యోగం కల్పిస్తారు. అభ్యర్థులు రీఫండబుల్​ ఫీజు కింద ఒక్కొక్కరు రూ.250 చెల్లించాలి. ఆసక్తి గలవారు ఒరిజినల్​ సర్టిఫికెట్స్​తో పాటు ఒక సెట్​ జిరాక్స్, ఆధార్​ కార్డు, రేషన్​ కార్డు, పాస్​పోర్ట్​ ఫోటో తీసుకొని జూలై 16న రామానంద తీర్థ ఇన్​స్టిట్యూట్​లో కౌన్సెలింగ్​కు హాజరు కావాలి.

అడ్మిషన్ల తేది: 2019 జూలై 16

చిరునామా: జలాల్‌‌పూర్ (విలేజ్)​, భూదాన్​ పోచంపల్లి (మండలం),
యాదాద్రి భువనగిరి (జిల్లా)
తెలంగాణ – 508284
ఫోన్​ నంబర్లు: 9948466111, 9133908000, 9133908111, 9133908222

వెబ్​సైట్​: www.srtri.com

కోర్సులు డ్యురేషన్ అర్హత
ఆటోమొబైల్​ సర్వీసింగ్(2, 3 వీలర్​) 3 నెలలు పదోతరగతి పాస్​/ఐటీఐ
ఎలక్ర్టానిక్ వస్తువుల రిపేర్, మెయింటెనెన్స్​​ 3 నెలలు పదోతరగతి పాస్​/ఐటీఐ
ఎలక్ర్టీషియన్​ (డొమెస్టిక్) 4 నెలలు పదోతరగతి పాస్​/ఐటీఐ
డి.టి.పి, ప్రింట్​ పబ్లిషింగ్​ అసిస్టెంట్​ 3 నెలలు ఇంటర్మీడియట్ పాస్​
అకౌంట్స్​ అసిస్టెంట్​ (ట్యాలీ) 3 నెలలు బీకాం పాస్​​
కంప్యూటర్​ హార్డ్​వేర్​ అసిస్టెంట్​ 3 నెలలు ఇంటర్మీడియట్ పాస్​
సోలార్​ సిస్టమ్​ ఇన్‌‌స్టలేషన్​ మరియు సర్వీస్​ 3 నెలలు ఇంటర్మీడియట్ పాస్​/ఐటీఐ
సూయింగ్​ మెషీన్​ ఆపరేటర్ (టైలరింగ్) 3 నెలలు ఏడోతరగతి పాస్​/ఫెయిల్​