CMR ఇంజనీరింగ్ కాలేజీలో JEE అడ్వాన్స్ పరీక్ష.. పరీక్ష నిర్వహణలో సాంకేతిక ఇబ్బందులు

దేశ వ్యాప్తంగా నేడు జేఈఈ అడ్వాన్స్ పరీక్ష నిర్వహించారు. అయితే నగ‌రంలో సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ సెంటర్లో సాంకేతిక సమస్యలు రావడంతో పరీక్షను ఆలస్యంగా నిర్వహించారు. ఉదయం 9గం. ల నుంచి 12గం.ల వరకు పరీక్ష నిర్వహించాల్సి ఉండ‌గా.. సీఎంఆర్ సెంటర్లో మాత్రం 9.45గం. లకు ప్రారంభమై 12.45 వరకు కొనసాగింది . 2.30గం.లకు ప్రారంభం కావాల్సిన సెకండ్ పేపర్ మధ్యాహ్నం 3గం. లకు వాయిదా వేసారు నిర్వాహకులు.

విద్యార్థుల బయోమెట్రిక్ తీసుకోవడంలో సాంకేతిక ఇబ్బందులు త‌లెత్తాయి. విద్యార్థుల బయోమెట్రిక్ పరీక్షకు ముందు కాకుండా పరీక్ష అయ్యాక తీసుకున్నారు పరీక్ష నిర్వాహకులు. ఫోటో ఐడి, పాస్వర్డ్ ను గుర్తించడంలోనూ సాంకేతిక సమస్యలు ఎక్కువగా వచ్చాయి. పరీక్ష నిర్వహణలో సర్వత్రా నిర్లక్ష్యం కనపడుతుందని ఆరోపణలు వచ్చాయి.

Latest Updates