చైనాతో ఇండియా టెక్‌‌వార్‌‌..గెలుపెవరిదో ?

న్యూఢిల్లీప్రభుత్వం 59 చైనీస్‌‌ యాప్‌‌లను బ్యాన్‌‌ చేసి చైనాతో టెక్ వార్‌‌‌‌కు దిగిందనే చెప్పాలి. ఈ యాప్స్‌‌లలో టిక్‌‌టాక్‌‌, వీ చాట్‌‌ వంటి పాపులర్‌‌‌‌ యాప్స్‌‌ కూడా ఉన్నాయి. వీటితో పాటు 5 జీ టెలికాం నెట్‌‌వర్క్‌‌ను ఇండియాలో బిల్డ్‌‌ చేయడానికి హ్యువావే, జెడ్‌‌టీఈ వంటి చైనీస్‌‌ కంపెనీలకు అవకాశం ఇవ్వడంపై ప్రభుత్వం ఆలోచనలోపడింది. టిక్‌‌టాక్‌‌ బ్యాన్‌‌తో బైట్ డ్యాన్స్‌‌  ఆరు బిలియన్‌‌ డాలర్ల దాకా నష్టపోతుందని అంచనా.  టిక్‌‌టాక్‌‌(పేరెంట్‌‌ కంపెనీ బైట్‌‌ డ్యాన్స్‌‌) చైనాలో గొప్ప టెక్నాలజీ  కంపెనీ కాదు, కానీ ఫైనాన్షియల్‌‌గా ఇంత భారీ లాస్‌‌ను భరించడానికి సిద్ధంగా లేదు. అందుకే చైనా ప్రభుత్వం తమను యూజర్ల డేటా అడగడం లేదని సన్నాయినొక్కులు నొక్కుతోంది. మరోవైపు యాప్‌‌ల బ్యాన్‌‌పై చైనా ప్రభుత్వం కూడా ‘ఆందోళన చెందుతున్నాం’ అని మాత్రమే ఓ ప్రకటన ఇచ్చింది. యాప్స్‌‌ బ్యాన్‌‌తో చైనాకి నొప్పి తగిలినట్లు అనిపించడం లేదని  కొందరు ఎనలిస్టులు అంటున్నారు.   ఒకవేళ చైనాను భారీగా నష్టపరచాలనుకుంటే కన్జూమర్‌‌‌‌ గూడ్స్‌‌ సెక్టార్‌‌‌‌లోని పాపులర్‌‌‌‌ టెక్‌‌ కంపెనీలను ఇండియా  ప్రభుత్వం బ్యాన్‌‌ చేయొచ్చు. ఈ సెక్టార్‌‌‌‌లోని ఒప్పో, వివో, షావోమి, హయర్‌‌‌‌, లెనోవా వంటి కంపెనీలను టార్గెట్‌‌ చేస్తే చైనాకు నష్టం జరిగుండేది. ఎందుకంటే ఈ కంపెనీలు గత కొన్నేళ్ల నుంచి చైనాను గ్లోబల్‌‌ టెక్‌‌ పవర్‌‌‌‌గా నిలుపుతున్నాయి. ఇవి కూడా ఇండియాను అతిపెద్ద విదేశీ మార్కెట్‌‌గా చూస్తుండడం విశేషం. చైనీస్‌‌ యాప్స్‌‌పై బ్యాన్‌‌  ఒక హెచ్చరిక లాంటిది మాత్రమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదొక సర్జికల్‌‌ స్ట్రయిక్‌‌ లాంటిదని చెబుతున్నారు.

ఆర్థిక యుద్ధం కోరుకోవడం లేదు..

ఇండియన్‌‌ గవర్నమెంట్‌‌ ఈ కంపెనీలను ఎందుకు టార్గెట్‌‌ చేయలేదనే ఆలోచన సామాన్య జనాలకు రాక మానదు. ఇండియా తన అడుగులను జాగ్రత్తగా బ్యాలెన్స్‌‌ చేసుకుంటూ వేస్తోందని నిపుణులు అంటున్నారు. మన జవాన్ల వీర మరణాలకు ప్రతీకారం తీర్చుకోవడం అవసరమే కానీ, చైనాతో రాత్రికి రాత్రి ఎకనామిక్‌‌ వార్‌‌‌‌ను ఇండియా కోరుకోవడం లేదు. ఎందుకంటే ఇండియా మాదిరే చైనా కూడా ఘాటుగా స్పందిస్తుంది కాబట్టి. జనరిక్‌‌ డ్రగ్‌‌ మెటీరియల్స్‌‌ లేదా ఆటో పార్ట్‌‌లను ఇండియాకు ఎగుమతి చేయడాన్ని చైనా బ్యాన్‌‌ చేయొచ్చు. దీంతో ఇండియాలో ఫార్మా, ఆటోమోటివ్‌‌ సెక్టార్లు ‌‌ రాత్రికి రాత్రే కుదేలవుతాయి.

టెక్‌‌ వార్‌‌‌‌ను ఇండియా ఇప్పటికే స్టార్ట్ చేసింది కాబట్టి చైనా  కూడా ప్రతి స్పందించే అవకాశాలున్నాయి. ఇన్ఫోసిస్‌‌, టీసీఎస్‌‌, విప్రో వంటి మన టెక్‌‌ కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెట్టాయి.  రెండోది,  ఇండియన్‌‌ టాలెంట్‌‌ను చైనా ఇబ్బంది పెట్టొచ్చు. గ్లోబల్‌‌గా ఉన్న సిలికాన్‌‌ వ్యాలీ, లండన్‌‌, టోక్యో, సిడ్నీ వంటి టాప్‌‌ టెక్ హబ్‌‌లలో చైనా కంపెనీలు విపరీతంగా పెట్టుబడులు పెట్టాయి. ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో ఇండియన్స్‌‌ ఉద్యోగాల కోసం ఈ హబ్‌‌లకు వలస కడుతున్నారు.  ఇండియన్‌‌  టాలెంట్‌‌ను హైర్ చేసుకోవద్దని తమ వెంచర్‌‌‌‌ క్యాపిటల్‌‌ ఫర్మ్స్‌‌పై చైనా ఒత్తిడి తీసుకురావొచ్చు. అప్పుడీ టెక్‌‌ వార్‌‌‌‌ కాస్తా టాలెంట్‌‌ వార్‌‌‌‌గా మారుతుంది. మూడోది, బౌగోళిక పరిస్థితులను వాడుకొని ఇండియాను చైనా ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి.

Latest Updates