ఎంట్రెన్స్ కు రెడీ అవుతూ… బాత్ రూంలో ఉరివేసుకున్నాడు

హైదరాబాద్: బాత్ రూంలో ఉరివేసుకున్నాడు ఓ టీనేజర్. హైదరాబాద్ మాదాపూర్ లో ప్రత్యూష్ మిశ్రా(18) అనే టీనేజర్ తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. ఇంటర్ పూర్తయిన అతను ఇంట్లో ఉంటూనే JEE ఎంట్రెన్స్ కు రెడీ అవుతున్నాడు. సోమవారం పొద్దున 10.30 నిమిషాలకు రూంలో ఉన్న ప్రత్యూష్ ను వాళ్ల అమ్మ పిలిచే సరికి ఎంతకూ డోర్ తీయలేదు. దీంతో అనుమానం వచ్చి వాళ్ల భర్తకు సమాచారం అందించింది. దీంతో తల్లిదండ్రులిద్దరూ కలిసి డోర్ ను విరగ్గొట్టి చూడగా ప్రత్యూష్.. బాత్ రూంలో ఉరి వేసుకున్నట్లు గమనించారు. వెంటనే హాసిటల్ కు తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లుగా డాక్టర్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించగా… గాంధీ హాస్పిటల్ కు  తరలించి మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. పోలీసులు దర్యాప్తులో… అనారోగ్య కారణంగానే ప్రత్యూష్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.

Latest Updates