ఆటలో గొడవ.. ఒకరిని చంపి కాల్చేసిన స్నేహితులు

గొడ్డలితో నరికి చంపి.. రబ్బరు తోటలో కాల్చివేత

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన హత్య

లాక్డౌన్ నిబంధనలను పాటించి అందరూ ఇళ్లలోనే ఉండాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలిచ్చాయి. వాటిని బేఖాతరు చేసి ఆడుకోవడానికి వెళ్లిన యువకులు గొడవపడి ఒకరి ప్రాణం తీశారు. ఆటలో గొడవ జరిగి తొటి స్నేహితుడి ప్రాణాలు తీసిన ఘటన కేరళలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆదివారం కొడుమాన్ ప్రాంతంలో జరిగినట్లు సమాచారం.

కేరళలోని పతనంథిట్ట జిల్లా, అంగడిక్కల్ కు చెందిన 16 ఏళ్ల అఖిల్ తన స్నేహితులిద్దరితో కలిసి ఆడుకోవడానికి వెళ్లాడు. ఆటలో ఏం గొడవ జరిగిందో ఏమో కానీ.. అతని ఇద్దరు స్నేహితులు అఖిల్ ని గొడ్డలితో నరికి చంపారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని పక్కనే ఉన్న రబ్బరు తోటలో కాల్చి వేశారు. ఆడుకోవడానికి వెళ్లిన అఖిల్ ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు.. అఖిల్ తో ఆడుకున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. అఖిల్ ను హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటలో వచ్చిన వివాదమే అఖిల్ హత్యకు దారితీసిందని పోలీసులు చెబుతున్నారు.

For More News..

ఆట అంటే వీళ్ళది.. ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి టెన్నిస్.. వీడియో వైరల్

‘కరోనా జంతువుల నుంచే వచ్చింది.. ల్యాబ్ నుంచి కాదు’

జియోలో వాటా కొన్న ఫేస్‌బుక్

Latest Updates