టిక్​టాక్​లో లైకులు రాలేదని, సూసైడ్​ చేసుకుండు

  • డిప్రెషన్​కు గురై టీనేజర్​ ఆత్మహత్య.. నోయిడాలో ఘటన

న్యూఢిల్లీ: టిక్​టాక్​లో తాను పెడుతున్న వీడియోలకు సరిగ్గా లైక్​లు రావడం లేదని ఓ టీనేజర్​ ఆత్మహత్య చేసుకున్నాడు. నోయిడా సెక్టార్ 39 పోలీస్​ స్టేషన్​ పరిధిలోని సలర్​పూర్​లో 18 ఏండ్ల యువకుడు నివసిస్తున్నాడు. సోషల్​ మీడియాలో అతడు చాలా యాక్టివ్​గా ఉండేవాడు. టిక్​టాక్​ను ఎక్కువగా వాడుతూ.. సాంగ్స్, స్టంట్స్​కు సంబంధించిన తాను చేసిన వీడియోలను అందులో పోస్ట్​ చేసేవాడు. అయితే ఈ మధ్య తాను పెడుతున్న పోస్టులకు అస్సలు లైక్స్​ రావడం లేదు. దీంతో పూర్తిగా డిప్రెషన్​లోకి వెళ్లిపోయిన అతడు గురువారం రాత్రి తన రూమ్ లో ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తలుపులు బద్దలుగొట్టి అతడి మృతదేహాన్ని బయటికి తీశారు. డెడ్​బాడీ దగ్గర ఎటువంటి సూసైడ్​ నోట్​ దొరకలేదని, టిక్ టాక్​లో తన వీడియోలకు లైకులు రావడం లేదని అతడు కొన్నాళ్లుగా డిప్రెషన్​లోకి వెళ్లాడని, దాని వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు చెప్పారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు.

Latest Updates