ఆన్ లైన్ బిజినెస్ లో దూసుకుపోతున్నటీనేజర్లు

టీనేజర్లు కొత్తగా ఆలోచిస్తున్నారు. కరోనాతో కాలేజీలు, స్కూల్స్ మూతపడటంతో.. ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఇళ్లలో టైమ్‌ని వేస్ట్ చేయకుండా.. కొంత
సమయాన్ని ఆన్ లైన్‌ క్లాస్ లకు కేటాయిస్తూ .. మరికొంత టైమ్‌ని తమకు ఇంటరస్ట్‌ ఉన్న రంగాల్లో బిజినెస్ ల్లోకి దిగుతున్నారు. ఇంటి నుంచే వ్యాపారాలు చేస్తున్నారు.
ఇన్ స్టాగ్రామ్, ఫేస్ క్ వంటి ‘సోషల్ మీడియా ప్లాట్‌ఫా మ్‌’లపై తమ బిజినెస్ లను ప్రమోట్ చేసుకుంటూ.. వ్యాపారాల్లో దూసుకుపోతున్నారు. ఆన్ లైన్  గానే ఆర్డర్లు చేసుకుని డెలివరీ చేస్తున్నారు

భవిక గుప్తా.. కరోనా వైరస్‌‌తో కాలేజీలు మూతపడటంతో తిరిగి స్వదేశానికి వచ్చింది. ఇప్పుడంతా ఆన్‌ లైన్ క్లాస్‌‌లు కదా.. రాత్రంతా ఆన్‌ లైన్ క్లాస్‌‌లతోనే సరిపోతుంది. అలా అని భవికా పగలంతా ఏమీ నిద్రతోనే సమయం గడిపేయదు. క్రంబల్‌ బ్లర్ అనే ఫుడ్ బిజినెస్‌‌ను చేస్తోంది.. పది రకాల డెజర్ట్స్, లడ్డూలు, కేక్‌‌లు అమ్మడమే ఆమె వ్యాపారం. కాలేజీలు ప్రారంభం కావడం ఆలస్యమవుతుండటంతో.. భవికా లాంటి చాలా మంది టీనేజర్లు ఇప్పుడు సరి కొత్త ఆలోచనలతో సొంతంగా వ్యాపారాలను ప్రారంభిస్తున్నా రు. ఇంటి నుంచే వ్యాపారాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది వరకు క్యాంపస్‌‌లు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపిం చకపోతుండటంతో.. భవికా తనకు ఎంతో ఇష్టమైన కుకిం గ్, బేకింగ్‌‌ వ్యాపారాన్ని ప్రారంభించింది. ‘లాక్‌‌డౌన్‌ తో అమెరికా నుంచి నా సొంతూరు బెంగళూరుకి వచ్చేశాం . ఈ సమయంలోనే సొంతంగా
ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా నాకు ఎంతో ఇష్టమైన కుకిం గ్, బేకింగ్ వ్యాపారం పెట్టాను. ఒకవేళ 2021 ప్రారంభంలో అమెరికాలో కాలేజీలు మళ్లీ ప్రారంభమైతే..నా బిజినెస్‌‌నంతా అమ్మకి అప్పజెప్తా. నేను నా స్టడీస్ పూర్తి చేసుకుని వచ్చేంత వరకు అమ్మనే ఈ వ్యాపారం నిర్వహిస్తుంది’ అని భవికా అంటోంది. కరోనా చాలా మంది టీనేజర్ల ఎడ్యుకేషన్‌ ను బ్రేక్ చేసింది. అకడమిక్ ఇయర్ ప్రారంభం కావడం ఆలస్యమయ్యేలా చేసింది. ఈ సమయంలో ఇంట్లోనే ఉంటున్న వారు, వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్న విద్యార్థులు సొంతంగా బిజినెస్‌‌లు ప్రారంభిస్తున్నారు.

స్కిన్‌ కేర్ ప్రొడక్ట్‌‌ల నుంచి ఫర్నీచర్, ఆన్‌ లైన్ బేకరీస్, మెంటల్ హెల్త్ యాప్స్ వంటివి రూపొందిస్తున్నారు. ఒకవేళ క్లాస్‌‌లు ప్రారంభమైన ఆన్‌ లైన్‌ గా ఆర్డర్లు తీసుకుని, డెలివరీ చేస్తామని నమ్మకంగా చెబుతున్నారు. చాలా వరకు టీనేజర్లు తమ వ్యాపారాలను ఇన్‌ స్టాగ్రామ్, ఫేస్‌‌బుక్, డంజో ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్లాట్‌ ఫామ్‌‌ల ద్వారా ఆర్డర్లు తీసుకుని, డెలివరీలు చేస్తున్నారు. ఇప్పుడంతా మార్కె టింగ్ సోషల్ మీడియా, వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే జరుగుతోంది. ఇన్‌ స్టాగ్రామ్‌‌పై పనిచేయడం చాలా తేలికని బ్రెడ్‌ మేకింగ్ కంపెనీ థొరొబ్రెడ్‌ నిర్వహించే కనిష్క్ గుప్తా చెప్తున్నా డు. కనిష్క్‌‌ బెంగళూరులో టెన్త్ చదువుతున్నా డు. గత కొన్ని నెలల నుంచి వాట్సాప్‌ ద్వారా అమ్మిన తర్వాత.. ఇప్పుడు ఇన్‌ స్టాగ్రామ్‌‌పై పనిచేస్తున్నట్టు పేర్కొన్నాడు. రోజుకు రెండు ఆర్డర్లు కచ్చితంగా వస్తాయని చెప్పాడు. ఇప్పుడు తనకు ఆన్‌ లైన్ క్లాస్‌‌లు ప్రారంభమయ్యాయయని, కరిక్యులమ్ కాస్త కష్టంగా ఉంటుందని అంటున్నాడు. బెం గళూరుకు చెందిన లా స్టూడెంట్ నందిత, సంజీవినిలు కూడా లాక్‌‌డౌన్ టైమ్‌‌లో వ్యాపారం ప్రారంభించారు. ఇన్ని రోజులు తమకు తెలిసిన ఫ్యామిలీలకు, ఫ్రెండ్ స్‌ కు అమ్మిన నేచురల్ ఫేస్‌‌ ప్యాక్‌‌లను, క్రీమ్‌‌లను ఇప్పుడు బయట కూడా విక్రయిస్తున్నారు. పేరెంట్స్ నుంచి రూ.10 వేలు తీసుకుని, ఇన్‌ స్టాగ్రామ్ ద్వారా మా బిజినెస్‌‌ను ప్రమోట్ చేసుకోవడం ప్రారంభించాం . నాలుగు నెలల్లో 90 ఆర్డర్ల వరకు వచ్చాయి.

Latest Updates