SI ని కారుతో ఢీ కొట్టిన యువకులు

వికారాబాద్ జిల్లా అనంతగిరిలో డ్యూటీలో ఉన్న SIని హైదరాబాద్ కు చెందిన నలుగురు యువకులు కారుతో ఢీ కొట్టారు. నవాబుపేట SI కృష్ణ బృందం… అనంతగిరిలో వెహికిల్స్ తనిఖీ చేస్తుండగా… ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎస్సై కృష్ణ కాలు విరిగిపోయింది. తీవ్రంగా గాయపడిని SIని చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. కారును వెంబడించిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు  చేశారు. ప్రమాదానికి కారణమైన యువకులు డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా టోలిచౌకీకి చెందిన ఇమ్రాన్, హనువర్, నవీద్, సమీర్ గా గుర్తించారు.

Latest Updates