మోడీపై పోటీ చేస్తున్న మాజీ BSF జవాన్

వారణాసిలో రోజు రోజుకూ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మోడీపై పోటీకి సమాజ్ వాదీ పార్టీ మొదట ప్రకటించిన అభ్యర్ధి స్థానంలో.. మరో అభ్యర్ధిని బరిలోకి దించింది. భద్రతా దళాలకు పెట్టే ఆహార నాణ్యత విషయంలో ఫిర్యాదు చేసి.. ఉద్యోగం కోల్పోయిన మాజీ BSF జవాన్ తేజ్ బహదూర్ ను మోడీపై.. పోటీకి దించుతున్నట్లు ప్రకటించింది. మరో వైపు.. ప్రధానిపై లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసి, తమ నిరసనను తెలియజేయాలనుకున్న నిజామాబాద్  రైతుల్లో 25 మంది తమ నామినేషన్లను వేశారు.

Latest Updates