తొలి, మలి దశఉద్యమకారులను గుర్తిస్తాం..ఉద్యమకారులు అప్లై చేసుకోవడానికి ప్రత్యేక వెబ్‌‌సైట్‌‌

తొలి, మలి దశఉద్యమకారులను గుర్తిస్తాం..ఉద్యమకారులు అప్లై చేసుకోవడానికి ప్రత్యేక వెబ్‌‌సైట్‌‌
  • కేకే కమిటీ సభ్యులు కోదండరాం, రాములునాయక్ 

మహబూబ్‌‌నగర్‌‌‌‌రూరల్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి, మలి దశ ఉద్యమాల్లో పనిచేసిన వారందరూ ఉద్యమకారులేనని, వారిని గుర్తించేందుకే కేకే కమిటీ ఏర్పాటు చేసినట్లు సభ్యులు కోదండరాం, రాములునాయక్ అన్నారు. గురువారం మహబూబ్‌‌నగర్‌‌‌‌లోని పాలమూరు యూనివర్సిటీలో వర్సిటీ ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి కేకే కమిటీ సభ్యులు కోదండరాం, రాములు నాయక్, క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. యూనివర్సిటీ ఉద్యమకారులు అడిగిన సందేహాలకు కోదండరాం, రాములునాయక్‌‌ సమాధానం ఇచ్చారు. ఉద్యమకారులు అప్లై చేసుకునేందుకు ప్రత్యేక వెబ్‌‌సైట్‌‌ రూపొందించామన్నారు. 

కేకే కమిటీ తొలి, మలిదశ ఉద్యమంలో అమరులైన వారిని గుర్తించి వారిని ఆదుకునేందుకు, వారి సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి సిఫార్స్​ చేస్తుందని తెలిపారు.  తెలంగాణ ఏ ఒక్కరి వల్ల రాలేదని, ఉద్యమంలో నష్టపోయిన వారికి న్యాయం చేసేందుకు కేకే కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

కమిటీ రాష్ట్రంలోని విద్యార్థులు, జేఏసీ నాయకులను సంప్రదించి, ఉద్యమంలో అమరులైనవారు, జైలుకు వెళ్లిన వారు, కేసులు అయినవారు, క్రియాశీలకంగా పనిచేసినవారి అభిప్రాయం మేరకే ఏర్పడిందన్నారు. ఉద్యమ సమయంలో పాలమూరు జిల్లాలో విస్తృతంగా పోరాట కార్యక్రమాలు జరిగాయన్నారు. 

జూరాల, కల్వకుర్తి, దిండి, నెట్టెంపాడు ప్రాజెక్టుల సామర్థ్యం పెంచినప్పుడే ఉమ్మడి జిల్లా రైతులకు లాభం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉద్యమ నాయకుడు పిడమర్తి రవి, యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్, రిజిస్టర్ రమేశ్‌‌బాబు, వర్సిటీ ఉద్యమకారులు పాల్గొన్నారు.