రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వర్ష సూచన

హైదరాబాద్, వెలుగు: జంట నగరాల్లో అక్కడక్కడ రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షా లు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. క్యుములో నింబస్ మేఘాల ప్రభావం వల్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని తెలిపారు. ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా తగ్గుతాయని వివరించారు. హైదరాబాద్ లో బుధవారం 39.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

ఇది దాదాపు సాధారణ ఉష్ణో గ్రతతో సమానం. జంట నగరాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని…ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు చెప్పా్రు. మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. జిల్లాల్లో 43 డిగ్రీల వరకు వెళ్లిన ఉష్ణో గ్రతలు కాస్త తగ్గు ముఖం పట్టాయని అన్నారు.

 

Latest Updates