అసెంబ్లీ రేపటికి వాయిదా

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. శాసనసభలో సీఎం కేసీఆర్, శాసన మండలిలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అలాగే పార్లమెంట్ లో పీవీ విగ్రహం, చిత్రపటం పెట్టాలని..హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కోరుతూ తీర్మాణం చేశారు.

తీర్మానంపై మాట్లాడిన నేతలు.. తెలంగాణ ఏర్పాటు తర్వాతే పీవీకి సరైన గౌరవం దక్కిందన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అయితే.. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలన్న తీర్మాన్ని వ్యతిరేకిస్తూ ఎంఐఎం.. ఇవాళ సభకు హాజరుకాలేదు. తీర్మానంపై చర్చ ముగిశాక ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. రేపటి నుంచి సభలో ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు.

Latest Updates