దుబ్బాక రిజల్ట్ తర్వాత అసెంబ్లీ!

  • అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసే చాన్స్​

హైదరాబాద్, వెలుగు: దుబ్బాక బై ఎలక్షన్ రిజిల్ట్ తర్వాత అసెంబ్లీ సమావేశం నిర్వహించాల ని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలిసింది. కేంద్ర తీసుకొచ్చిన అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ సభలో తీర్మానం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకరోజు అసెంబ్లీలో, మరుసటి రోజు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది. దుబ్బాక రిజల్ట్​ వచ్చాక అసెంబ్లీని సమావేశపరిచే చాన్స్ ఉందని టీఆర్ఎస్ కు చెందిన ఓ సీనియర్  లీడర్  చెప్పారు. తాము వ్యతిరేకించినా చట్టాలు మాత్రం ఆగవని ఆయన అన్నారు.

Latest Updates