రేప‌టితోనే ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. దీనికి సంబంధించి  బీఏసీ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో బీఏసీ సమావేశం జరిగింది. అసెంబ్లీ ఉభయ సభలు రేపటితో ముగించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. మొదట ఈనెల 28 వరకు కొనసాగించాలని బీఏసీలో నిర్ణయం తీసుకుంది. అయితే బిల్లులన్నీ ఆమోదం పొందడంతో రేపటితో సమావేశాలు ముగించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 7న అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. 28వ తేదీ వరకు మొత్తం 18 వర్కింగ్​ డేస్​లో సమావేశాలు నిర్వహించాలని అసెంబ్లీ, కౌన్సిల్​ బీఏసీల్లో నిర్ణయించారు.  సోమవారం అసెంబ్లీలో 8 బిల్లులు, కౌన్సిల్​లో 4 బిల్లులు పాస్​ అయ్యాయి. దీంతో ఈ సమావేశాల్లో ప్రభుత్వం అనుకున్న పనులన్నీ పూర్తికానున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్తున్న రెవెన్యూ బిల్లు రెండు సభల్లో ఆమోదం పొందింది. గవర్నర్ ఆమోదం కోసం బిల్లును రాజ్ భవన్ కు పంపించనుంది అసెంబ్లీ సెక్రటేరియట్ .

Latest Updates