అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండా ఎగురవేసిన స్పీకర్ పోచారం

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రాజెక్టుల విషయంలో ఏపీ అనవసరంగా గిల్లికజ్జాలకు దిగుతుందని ఆయన అన్నారు. పర్యావరణ మరియు నీటి కేటాయింపుల అనుమతులు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామని ఆయన అన్నారు. ‘క్రిష్ణా బేసిన్ లో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కూడా అన్ని అనుమతులు ఉన్నాయి. ఎవరైనా అనవసర తగాదాలకు దిగొద్దు. కూర్చొని మాట్లాడితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రజలకు న్యాయం జరగాలంటే సహృదయంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. నీటి పంపకం విషయంలో ఏ రాష్ట్రానికి ఎంత వాటా ఉందో ట్రిబ్యునల్స్ తీర్పులు కూడా వున్నాయి. అన్నదమ్ముల్లా విడిపోదాం… ఆత్మీయంగా కలిసుందాం అని అప్పుడే చెప్పాం. రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీ అయినా సరే మంచికి సపోర్ట్ చేయాలి. ప్రతి విషయంలో రాజకీయం చేయడానికి ఇవి వేదికలు కావు. సమన్వయంతో ముందుకు వెళదాం. మిషన్ భగీరథతో రాష్ట్రంలో ప్రతి ఇంటికి నీళ్ళు వెళుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన అన్నారు.

For More News..

ఢిల్లీలో జాతీయజెండా ఎగురవేసిన కిషన్ రెడ్డి

దేశంలో 25 లక్షలు దాటిన కరోనా కేసులు

రాష్ట్రంలో 90 వేలు దాటిన కరోనా కేసులు

Latest Updates