అసెంబ్లీలో ఫుల్ బడ్జెట్

  • ఉదయం 11 గంటలకు మండలి, అసెంబ్లీ ప్రారంభం
  • 11.30కు అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశ పెట్టను న్న సీఎం కేసీఆర్
  • శాసన మండలిలో బడ్జెట్ చదవనున్న ఆర్థిక మంత్రి హరీశ్

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ కోసం సోమవారం నుంచి అసెంబ్లీ , మండలి సమావేశాలు జరుగనున్నాయి . ఉదయం 11.30 గంటలకు రెం డు సభలు ప్రారంభమవుతాయి. ఇంతకు ముందే అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ ను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆరే.. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్ట నున్నారు. ఇప్పటికే బడ్జెట్ ప్రసంగం పుస్తకాల ముద్రణ పూర్తయింది . ఆదివారం వరకు సీఎం వద్దే ఆర్థిక శాఖ ఉండటంతో ఆయన పేరిటే బడ్జెట్ పుస్తకాలు ముద్రించారు. ఆదివారం సాయంత్రం ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిం చిన హరీశ్ రావు..శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

9 రోజులు సమావేశాలు!

2019–20 పూర్తి స్థాయి బడ్జెట్ ఫిబ్రవరిలో పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కంటే తక్కువగానే ఉంటుం దని అంచనా వేస్తున్నారు. సుమారు లక్షా 60వేల కోట్లకు అటూ ఇటూగా కేటాయింపులు ఉండొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి . ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో పోలిస్తే ఇది 20 వేల కోట్లు తక్కువ. ఆర్థికమాంద్యం కారణంగా కేటా యింపుల్లో కోతలు ఉండొచ్చని అంటున్నాయి . సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగేదీ.. బడ్జెట్ ప్రసంగం తరువాత నిర్వహించే బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. సెలవు రోజులుపోగా 9 రోజులు సమావేశాలు జరిగే చాన్స్ ఉంది.

తొలిసారి ఆర్థిక మంత్రిగా హరీశ్ రావు

గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవమున్న హరీశ్ రావు తొలిసారిగా ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టారు. మూడోసారి మంత్రిగా ప్రమాణం చేసిన తెల్లారే ఆయన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్ట-బోతున్నారు. గత ప్రభుత్వంలో హరీశ్ రావు ఇరిగేష-న్ తో పాటు శాసన సభ వ్యవహారాలను చూశారు.ఈసారి ఆర్థికశాఖ ఇచ్చారు.

ప్రభుత్వంపై దాడికి ప్రతిపక్షాలు రెడీ

బడ్జెట్ సమావేశాల్లో సర్కారుపై అటాక్ చేయడానికి ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి . రాష్ట్రవ్యాప్తంగా డెంగీ,టైఫాయిడ్, విష జ్వరాల విజృంభణ, యూరియాకొరత, యాదాద్రిలో సీఎం బొమ్మ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఇప్పటికే కొందరు నేతలు ప్రకటిం చారు. కాం గ్రెస్ సభ్యులంతా ప్రభుత్వ తీరును ఎండగట్టాలని ఆ పార్టీ పెద్దలు సూచించారు.యాదాద్రి శిల్పా ల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఎమ్మెల్యే సిద్ధమయ్యారు.

Latest Updates