వాహన మిత్ర … తెలంగాణలో కూడా అమలు చేయాలి

  • అక్టోబర్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక ఆటో బంద్
  • తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ డిమాండ్

హైద‌రాబాద్‌: పక్క రాష్ట్రం ఏపీలో ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ వాహన మిత్ర పేరుతో ఇస్తున్న 10 వేల సహాయాన్ని… తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జేఏసీ కన్వీనర్ అమనుల్లా ఖాన్ విమర్శించారు. ఈ మేరకు హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ప్రభుత్వ వైఖరికి నిరసనగా అక్టోబర్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక ఆటో బంద్ చేపట్టనున్నట్లు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నూతన సచివాలయ నిర్మాణాన్ని వాయిదా వేయాలని ఆయన ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు.

గత శుక్రవారం ప్రగతి భవన్ ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఆటో డ్రైవర్ చందర్ త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు అమనుల్లా ఖాన్. ఆటో డ్రైవర్లు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని … అందుకోసం అక్టోబర్ 2న ఆత్మహత్యల వ్యతిరేక దినంగా పాటిస్తూ… ఒకరికొకరు చాక్లెట్ లు తినిపించుకోవలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ తరహాలో ఆటో డ్రైవర్లకు 10 వేల సహాయాన్ని ఇవ్వకపోతే…. రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పేందుకు ఆటో డ్రైవర్లు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.

Latest Updates