సమ్మెకు మద్దతుగా బీజేపీ నేతల నిరనసలు… లక్ష్మణ్ అరెస్ట్

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బీజేపీ నేతలు నిరనసలు చేపట్టారు. అబిడ్స్ దగ్గర జరిగిన ఆందోళనల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి, మోహన్ రెడ్డి తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ స్థాయిలో ఉద్యమం జరుగుతున్నా సీఎం కేసీఆర్ లో చలనం లేదని ఫైర్ అయ్యారు లక్ష్మణ్. కార్మికుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. బీజేపీ ర్యాలీని అఢ్డుకున్న పోలీసులు నేతలను అరెస్ట్ చేశారు.

ఆర్టీసీ కార్మికులు పిలుపు ఇచ్చిన రాష్ట్ర బంద్ కు మద్దతుగా..  పొద్దున నుంచి స్టుడెంట్స్ యూనియన్లు, రాజకీయ పక్షాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నాయి. పలు జిల్లాలలో డిపోలముందు దర్నాలు జరుతున్నాయి. దీంతో నాయకులను, విద్యార్థి లీడర్లను  అరెస్టు చేస్తున్నారు పోలీసులు. అయితే ఇంత రచ్చ జరిగినా ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదని అన్నారు నాయకులు. ఉమ్మడి ప్రభుత్వం కంటే కూడా కేసీఆర్ నియతృత్వంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

Latest Updates