జనం వచ్చారు.. షా రాలేదు

కరీంనగర్, వరంగల్ సభలకు అమిత్ షా డుమ్మా.. నేరుగా ఏపీ ప్రచారానికి  కరీం నగర్ లో గు రువారం బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. జనం భారీ సంఖ్యలో వచ్చినా కమలం పార్టీ చీఫ్ అమిత్ షా ఈ సభకు డుమ్మాకొట్టారు. గురువారం కరీంనగర్, వరంగల్ లో జరగాల్సిన ఆయన పర్యటన చివరి క్షణంలో రద్దైం ది. అమిత్ షా నేరుగా ఏపీ వెళ్లి అక్కడ ప్రచారంలో పాల్గొ న్నారు. అదే సమయంలో ఇక్కడ సభల కోసం భారీగా జన సమీకరణ చేసినా అగ్రనేత రా కపోవడంతో నాయకులు, కార్యకర్తల్లో నిరాశవ్యక్తమైం ది. రా ష్ట్రంలో గట్టిపోటీ ఇచ్చే చాన్సున్నా పట్టించుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో బీజేపీ అధినేత అమిత్ షా ప్రచార సభలు రద్దు కావడంపై పార్టీ శ్రేణుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. గురువారం కరీంనగర్, వరంగల్ లలో జరగాల్సిన ఆయన పర్యటన చివరిక్షణంలో రద్దైంది. అమిత్ షా నేరుగా ఏపీ వెళ్లి అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. అదే సమయంలో ఇక్కడ సభల కోసం భారీగా జనం వచ్చినా అగ్రనేతే రాకపోవడం నాయకులను, కార్యకర్తలను ఆశ్చర్యాని కి గురిచేసింది. ఉదయం అహ్మదా బాద్ నుంచి కరీంనగర్ రావాల్సి న అమిత్ షా బయలుదేరడం ఆలస్యమైంది. దీంతో ఆయన రావాల్సిన హెలికాప్టర్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వచ్చి ప్రసంగించారు. ప్రధాని మోడీతో అత్యవసర సమావేశం ఉండడం వల్లే రాలేకపోయారని పార్టీ వర్గాలు చెప్పాయి.

అయితే పార్టీ జాతీయ అధ్యక్షుడు వస్తుండడంతో కరీంనగర్ సభకు భారీగా జనసమీకరణ చేశారు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ తో పాటు పక్కనే పెద్దపల్లి పార్లమెంట్ సీటు పరిధి నుంచి మద్దతుదారులను తరలించారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ సభకు 15వేల నుంచి 20 వేల మంది హాజరైనట్లు అంచనా. ఇంత కష్టపడితే అధినేత రాకపోవడం పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ సీటులో పోటీచేసి గట్టి పోటీ ఇచ్చిన బండి సంజయ్ ఇప్పుడు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నా రు. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు రాష్ట్రంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులందరిలోనూ ఎక్కువ ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఓటమితో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఆయనకు సానుభూతి వచ్చిందనీ, యువతలోనూ ఆయనకు మంచి మద్దతు ఉండడం కలిసొస్తుందన్న ధీమాలో స్థాని క బీజేపీ శ్రేణులు ఉన్నాయి.

సెగ్మెంట్ పరిధిలో మున్నూరు కాపు ఓట్లు ఎక్కువగా ఉండడంతో గట్టి పోటీ ఇస్తామని వారు నమ్ము తున్నారు. గతంలో ఈ సీటును బీజేపీ గెలిచిన ట్రాక్ రికార్డుకు తోడు జాతీయ నేతల ప్రచారం తోడైతే గెలుపు అవకాశాలు కూడా ఉన్నాయని ఆశలు పెట్టుకున్నా రు. అయితే అమిత్ షా ఇప్పుడు రాలేకపోయినా సంజయ్ ను గెలిపిస్తే విజయోత్సవ ర్యాలీకి తప్పకుం డా వస్తారని మురళీధర్ రావు కార్యకర్తలను ఊరడించే ప్రయత్నం చేశారు. దీంతో 9వ తేదీన ప్రచారం ముగిసేలోపు అగ్రనేతలతో సభ జరిగే అవకాశం లేదన్న సంకేతాలిచ్చినట్లైంది. ఇక అగ్రనేత ఎవరూ రాకుండానే సంజయ్ సొం తగానే ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల ప్రచార కార్యక్రమాలు ఖరారు కావడంతో మరో నేత వచ్చే అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయి.

నిజామాబాద్ లోనూ అంతేనా?

ఇక పసుపు రైతుల ఆందోళనతో జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోనూ బీజేపీ శ్రేణుల పరిస్థితి ఇదే. రైతుల నిరసనల తర్వాతే బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందన్న అంచనాలు రావడంతో వారికి ఉత్సాహం వచ్చింది. రెండేళ్లుగా ఈ సీటులో పనిచేస్తున్న ధర్మపురి అరవింద్ స్థానికంగా యువతలో పట్టుపెంచుకునే ప్రయత్నం చేశారు. మున్నూరు కాపు ఓటర్లు ఎక్కువగా ఉండడం, మోడీ హవా కలిసొస్తుం దని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లాలో ప్రధాని మోడీ ప్రచారం కూడా చేశారు. అయితే ఈసారి మాత్రం ఆయన సభలను మహబూబ్ నగర్, హైదరాబాద్ లకే పరిమితం చేయడంపై స్థాని క కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ లో మోడీ సభ ఉంటే మంచి జోష్ వస్తుందని వారు చెబుతున్నా రు. ఇటీవల కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నిజామాబాద్ సభకు వచ్చి ప్రచారం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుపై హామీ ఇచ్చారు. గట్టి పోటీ ఇస్తూ గెలుపు అవకాశాలు ఉన్నచోట్ల జాతీయ నేతల ప్రచారం లేకపోవడం సమన్వయ లోపమేనన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

Latest Updates