సీఎం జ్ఞానోదయం అయినట్టు మాట్లాడుతున్నడు: ఎంపీ సంజయ్

ఢిల్లీ: 55 రోజుల సమ్మె అనంతరం ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకున్న సీఎం కేసీఆర్ వ్యవహారం విచిత్రంగా ఉందన్నారు తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్. సోమవారం పార్లమెంట్ ఆవరణలోమీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కొత్తగా జ్ఞానోదయం అయినట్లు మాట్లాడుతున్నారని  అన్నారు. ఢిల్లీ నుంచి ఎల్లయ్య వస్తారా, మల్లయ్య వస్తారా అన్న కేసీఆర్ ఇప్పుడు ఎవరిని కలవడానికి ఢిల్లీ వస్తున్నారో చెప్పాలన్నారు. కేంద్ర పెద్దల గురించి మాట్లాడేటప్పుడు తన స్థాయికి తగినట్లు మాట్లాడుతే బాగుంటుందని సంజయ్ సూచించారు. కోర్టుల పై నమ్మకం కోల్పోయేలా సీఎం వ్యవహరిస్తున్నారని, కోర్టులను తప్పుదోవపట్టించారని అన్నారు. సమ్మె సందర్భంగా కార్మికులను చర్చలకు పిలవాలని కోరినప్పటికీ స్పందించని కేసీఆర్,ఇప్పుడు మాత్రం తానే సమస్యను పరిష్కరించాననే నీచ స్థితిలో ఉన్నారన్నారు. 30 మంది ఆర్టీసీ కార్మికులు,100 మంది ప్రయాణికుల చావుకు కారణమైన కేసీఆర్ .. ఆ చావులపై స్పందన లేదన్నారు.

 Telangana BJP MP  Bandi sanjay fire on CM KCR on RTC Strike

 

Latest Updates