సమ్మె విషయంలో జోక్యం చేసుకోండి: బీజేపీ ఎంపీలు

ఆర్టీసీ సమ్మె విషయంపై తెలంగాణ బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్విండ్, బండి సంజయ్, బాబూరావు లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ కి లేఖ రాశారు. “ ఆగస్ట్ 2019 గానూ 80 కోట్ల బకాయిలు చెల్లించమని EPO నుంచి డిమాండ్ నోటీస్ వచ్చింది. మొత్తం పీఎఫ్ కు సంబంధించి 760 కోట్ల బకాయిలు ఉన్నట్టు ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఇప్పటికే 49 వేల మంది ఉద్యోగులు సమ్మె చేసినా  రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం స్పందించలేదు. పీఎఫ్ బకాయిలు చెల్లించక పోవడం EPF యాక్ట్ ప్రకారం క్రిమినల్ చర్య. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా మీరు వెంటనే జోక్యం చేసుకోవాలి.” అని  ఎంపీలు తమ లేఖలో తెలిపారు.

అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి  ఆ లేఖను కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ కు సమర్పించారు.

Latest Updates