తెలంగాణ కుర్రోడికి సిల్వర్‌

గౌహతి: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్​లో తెలంగాణకు మరో మూడు మెడల్స్‌ లభించాయి. వెయిట్‌ లిఫ్టింగ్‌లో డి. గణేశ్‌ సిల్వర్‌ నెగ్గగా,బాక్సింగ్‌ లో జి . నిహారిక కాంస్యం గెలిచింది. అండర్‌ –17 బాయ్స్‌ ఖో ఖోలో తెలంగాణ జట్టుకు కాంస్యం దక్కింది. ఆదివారం జరిగిన అండర్‌ –17 బాయ్ స్‌ 73 కేజీల విభాగంలో గణేశ్‌ మొత్తం 248 (స్నాచ్‌107, జెర్క్‌‌ 138) కిలోల బరువెత్తి సెకండ్‌ ప్లేస్‌ తో రజతం సాధించాడు.

అండర్‌ –21 బాలికల 75కేజీల సె మీస్‌ లో ఓడిన నిహారిక బ్రాంజ్‌ తో సరిపెట్టింది. టెన్నిస్‌ లో సంజన, సామ సాత్విక సెమీస్‌ చేరారు. అండర్‌ –17 క్వార్టర్ స్‌ లో సంజన 6–4, 6–3తో లక్ష్మీ ప్రభ (తమిళనాడు)పై నెగ్గగా, అండర్‌ –21 క్వార్టర్స్‌ లో సాత్విక 7–5, 6–3తో యుబ్రానీ (బెంగాల్‌ )పై విజయం సాధించింది.

see also: ప్లానింగ్​ ఇట్ల కూడా : లాంగ్‌‌‌‌టర్మ్‌‌‌‌ లోన్లను త్వరగా తీర్చడం

Latest Updates