ఈనెల 19న మంత్రివర్గ విస్తరణ: సీఎం కేసీఆర్

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 19న పొద్దున 11.30 నిమిషాలకు మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ రోజు మధ్యాహ్నం 2.30నిలకు గవర్నర్ నరసింహన్ ను కలిసిన కేసీఆర్ తన నిర్ణయాన్ని తెలియజేశారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుండి విస్తరణకు సంబంధించి ప్రకటన వెలువడింది. మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి కావలసిన ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.

Latest Updates