నేడే మంత్రివర్గ విస్తరణ.. ప్రగతి భవన్ కు నేతల క్యూ

హైదరాబాద్ : ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సింగిరెడ్డి నిరంజన్‌‌‌‌రెడ్డి సోమవారం ఉదయం ప్రగతి భవన్‌‌‌‌లో సీఎం కేసీఆర్‌ భేటీ అయినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం వారిద్దరికి కేటాయించే శాఖలపై బ్రీఫ్‌ చేసినట్టు ప్రచారంలో ఉంది. ఇక ఎర్రబెల్లి దయాకర్‌ రావుతోపాటు ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్‌, యాదయ్య, మల్లారెడ్డి తదితరులు ప్రగతి భవన్ లో టీఆర్‌ ఎస్‌‌‌‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌ తో భేటీ అయ్యారు. కేటీఆర్‌ తో సమావేశం తర్వాత మల్లారెడ్డి మిఠాయిలు పంచిపెట్టారు. ఎర్రబెల్లి దయాకర్​రావు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు.

Latest Updates