ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుతారా..వ్యాపారస్థులకు సీఎం కేసీఆర్ వార్నింగ్

వ్యాపారస్థులపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో వ్యాపారస్థులు ఇష్టానుసారం రేట్లు పెంచి ప్రజల జేబుల్ని కొల్లగొడుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా వైరస్ పై మీడియాతో మాట్లాడిన కేసీఆర్… క్లిష్టపరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వ్యాపారస్థులు రేట్లు పెంచుతున్నట్లు తమకు సమాచారం వచ్చిందని అన్నారు. వ్యాపారస్థులు ఎవరైనా సరే ఇష్టానుసారం రేట్లు పెంచితే అమ్మకాలు జరిపితే పిడీ యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు. అంతేకాదు రేట్లు పెంచిన వ్యాపారస్థుల షాపులు కాని, వ్యాపార సముదాయాలపై కేసులు నమోదు చేసి శాశ్వతంగా మూసి వేస్తామని హెచ్చరించారు.

Latest Updates