కరోనా ఎఫెక్ట్ : కరీంనగర్ పర్యటనలో సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ శనివారం కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఇటీవల ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు వచ్చిన వారిలో కొంతమందికి కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్ లో వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ సలహాలు,సూచనలిచ్చారు. అయితే ప్రభుత్వం అలర్ట్ అవ్వడంతో కరీంనగర్ లో  స్థానికులెవరికీ వ్యాధి సోకకుండా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఈ ఫలితాలపై సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు శనివారం కరీంనగర్ పర్యటించనున్నారు. పర్యటనలో కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Latest Updates