నీట్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: సీఎం రేవంత్రెడ్డి

నీట్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: సీఎం రేవంత్రెడ్డి

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్, పరీక్షల నిర్వహణ జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభు త్వం అన్ని విధాలా విఫలమైందన్నారు. ఒకరిద్దిపై కేసులు పెట్టి నీట్ వివాదాన్ని క్లోజ్ చేయడానికి సీబీఐకి అప్పగించారని అన్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ అవసరమన్నారు. 

విద్యార్థులకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం.. పట్టించుకవడం లేదన్నారు. మోదీ గ్యారంటీ ఎక్కడ పోయిందని అన్నారు. సీబీఐ ఎంక్వయిరీ సరిపోదు.. జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కేంద్రాన్ని నిలదీశారు. ప్రస్తుతమున్న నీట్ పరీక్షా విధానాన్ని వెంటనే రద్దు చేసి .. పాత పద్దతిలో రాష్ట్రాలు మెడికల్ పరీక్షల నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి మమతా బెనర్జీ లెటర్ రాశారు. 

 తమిళనాడు డీఎం కే నేతలు కూడా  నీట్ వివాదంపై తీవ్రంగా స్పందించారు. సోమవారం (జూన్ 24) ఢిల్లీలో జరిగిన ఎన్ ఎస్ యూఐ ఆందోళన లో పాల్గొన్న డీఎంకే ఎంపీ కనిమొళి కూడా నీట్ పరీక్షా విధానాన్ని తప్పుబట్టారు. తమిళనాడు ఎప్పటినుంచే నీట్ పరీక్ష విధానం వద్దని అంటోంది. అయినా కేంద్రం పట్టించుకోలేదు.. నీట్ పరీక్షా విధానం మాకొద్దు .. నీట్ పరీక్ష విధానంనుంచి వెంటనే తమిళనాడు మినహాయించాలని కోరారు.